పండుగ వేళ ఈసమెత్తు బంగారమైన కొనాలనుకునే మగువలకు గుడ్ న్యూసేనని చెప్పాలి. గత నాలుగు నెలల్లో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని అనలిస్ట్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకు అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఫెడ్ నిర్ణయం తీసుకుంటుండంతో పాటు అధిక రాబడులు ఆశిస్తున్న మదుపర్లు డాలర్లు, బాండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. పైగా, చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం కారణంగా డిమాండ్ తగ్గి వెండి ధరపై ప్రభావం చూడపంతో అది కాస్త తగ్గింది. ఫలితంగా, పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల వైపు మొగ్గు చూపారని యాక్సిస్ సెక్యూరిటీస్‌లో కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దేవేయ గగ్లానీ అన్నారు.
10 రోజుల్లో రూ.2వేలు తగ్గింది
సెప్టెంబర్ 26న రూ.54 వేల 750గా ఉన్న పసిడి ప్రస్తుతం రూ.52,400గా ఉంది. అంటే సుమారు 8- 10 రోజుల్లోనే రూ.2000 వేలకు పైగా తగ్గింది. ఇక ప్రపంచ మార్కెట్‌లో స్పాట్ బంగారం ఔన్స్ ధర 1023 డాలర్లకు పడిపోయింది. ఇదే రెండు నెలల కనిష్ఠస్థాయి.
పెట్టుబడులు పెరుగుతాయి
మరోవైపు వెండి ధర పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.71,100గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ.400 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73వేల 500గా ఉంది. డాలర్ ఇండెక్స్ పెరుగుతూ 10 నెలల గరిష్ఠ స్థాయికి చేరడం, అమెరికాలో అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న భయాలతో ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయని అనలిస్ట్‌లు చెబుతున్నారు. అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ భారత్‌లో సైతం బంగారం ధరలు తగ్గుతున్నాయి. అలాగే , చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం ముదిరితే రియల్టీ నుంచి పెట్టుబడులు సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే పుత్తడిలోకి మళ్లుతాయని దీంతో ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ రోజు మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగాయి. దీంతో శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 100 పెరగగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 70 పెరిగింది. దీంతో దేశంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 52,500కి చేరుకోగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment