Tulasi chaitanya
-
ఇంగ్లిష్ జల సంధిని ఈదిన ఆంధ్ర హెడ్ కానిస్టేబుల్!
విజయవాడ: స్విమ్మింగ్ మౌంట్ ఎవరెస్ట్‌గా ప్రసిద్ధికెక్కిక ప్రఖ్యాత ఇంగ్లిష్ జలసంధిని అంతర్జాతీయ స్విమ్మర్ తులసీచైతన్య సునాయాసంగా ఈదాడు. ఇంగ్లండ్‌లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని కలైస్ తీరం వరకూ ఈ జలసంధి ఉంది. అక్కడి ఆర్గనైజర్లకు రూ.4 లక్షలు చెల్లించి ఆయా దేశాల అనుమతులు తీసుకుని ఈ నెల 27న 33.79 కిలోమీటర్ల పొడవున్న జలసంధిని 15 గంటల 18 నిమిషాల్లో ఈదాడు. స్విమ్మర్ తులసీచైతన్య విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గతంలో పాక్ జలసంధి(భారత్–శ్రీలంక), జీబ్రా జలసంధి(తరిఫా–మెహారో), బోడెన్సీ జలసంధి(జర్మనీ–స్విట్జర్లాండ్)లను ఈదిన రికార్డులున్నాయి. ఇంగ్లండ్ తీరంలో ఉన్న మరో రెండు జల సంధులను ఈదేందుకు తులసీచైతన్య సిద్ధమవుతున్నాడు. మైనస్ డిగ్రీల చలి, షార్క్‌లు, జెల్లీ ఫిష్‌లు కలిగిన ఇంగ్లిష్ జలసంధిని సాహసోపేతంగా ఈదిన తులసీచైతన్యను కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ అభినందించారు. ఇదీ చదవండి: Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
ఏపీ స్విమ్మర్ తులసీ చైతన్య అరుదైన ఘనత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ ఎం.తులసీ చైతన్య అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని కాటలీనా చానెల్‌ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్‌గా గుర్తింపు పొందాడు. 35 కిలోమీటర్ల పొడవు ఉన్న కాటలీనా చానెల్‌ను 30 ఏళ్ల తులసీ చైతన్య 12 గంటల 40 నిమిషాల 24 సెకన్లలో పూర్తి చేశాడు. విజయవాడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తులసీ చైతన్య ఈ ఘనత సాధించిన తొలి భారత పోలీస్ స్విమ్మర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 2015, 2017 ఆలిండియా పోలీస్ అక్వాటిక్స్ మీట్లో ‘బెస్ట్ స్విమ్మర్’ పురస్కారం పొందిన తులసీ చైతన్య ఇప్పటివరకు మూడుసార్లు ప్రపంచ పోలీసు క్రీడల్లో పాల్గొని భారత్‌కు 20 పతకాలు అందించాడు. కాటలీనా చానెల్‌ను ఈదడానికి తులసీ చైతన్య ద్రోణాచార్య అవార్డీ ప్రదీప్ కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఈ ఘనత సాధించే క్రమంలో తనకు మద్దతు నిలిచిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు, అడిషనల్ డీజీపీ శ్రీధర్ రావు, రూ. 2 లక్షల ఆరి్థక సహాయం అందించిన పాలకొల్లుకు చెందిన వ్యాపారవేత్త నరసింహ రాజు, తెలంగాణ ప్రిన్సిపల్ హోం సెక్రటరీ రాజీవ్ త్రివేదిలకు ఈ సందర్భంగా తులసీ చైతన్య కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే ఏడాది జిబ్రాల్టర్ జలసంధిని ఈదడమే తన లక్ష్యమని, ఇప్పటి నుంచే దాని కోసం శిక్షణ ప్రారంభిస్తానని తులసీ చైతన్య తెలిపాడు. -
తులసీ చైతన్యకు ఆరు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పోలీసు క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విజయవాడ స్విమ్మర్ తులసీ చైతన్య అద్భుత ప్రదర్శన చేశాడు. చైనాలోని చెంగ్డూలో జరిగిన ఈ క్రీడల్లో తులసీ చైతన్య ఒకస్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు సాధించాడు. విజయవాడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే తులసీ చైతన్య ట్రయాథ్లాన్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకం గెల్చుకోగా... 4్ఠ50 మిక్స్డ్ ఫ్రీస్టయిల్ రిలేలో, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజత పతకాలు సాధించాడు. 1500 మీటర్ల ఫ్రీస్టయిల్, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 4్ఠ50 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో తులసీ చైతన్య కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు తులసీ చైతన్య మూడుసార్లు (2013, 2017, 2019) ప్రపంచ పోలీసు క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 20 పతకాలు సాధించాడు. -
చరిత్ర సృష్టించిన తులసి చైతన్య
ఐర్లాండ్:రాష్ట్ర పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తులసి చైతన్య చరిత్ర సృష్టించారు. ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్లో జరు గుతున్న ప్రపంచ పోలీసు క్రీడల్లో చైతన్య మూడు బంగారు, మూడు రజత పతకాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. భారతదేశ చరిత్రలో ఓ అంతర్జాతీయ వేదికపై జరిగిన క్రీడల్లో ఒక క్రీడాకారుడు ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాష్ట్ర క్రీడల విభాగ అద నపు డిజి రాజీవ్ త్రివేదీ శిష్యుడైన చైతన్య ఏడాది క్రితమే ఈత పోటీల్లో వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకున్న చైతన్య ఇటీవల జరిగిన జాతీయ పోలీసు క్రీడోత్సవాలలో పతకాలు సాధించి సత్తాచాటారు. దీంతో ప్రపంచ పోలీసు క్రీడలకు అతను ఎంపికయ్యారు. పలు విభాగాల్లో పోటీ పడ్డ చైతన్య మొదట 4×50 మీటర్ల బటర్ ఫ్లై పోటీల్లో బంగారు పతకాన్ని సాధించగా అనంతరం 4×50 మీటర్ల మిడ్లే రిలేలోనూ సత్తా చాటి మరో బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు. దీని తరువాత వంద మీటర్ల ఫ్రీ స్టైల్లోనూ స్వర్ణ పతకం అందుకున్నారు. దీని తరువాత 50 మీ టర్ల ఫ్రీ స్టైల్, వంద మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో మూడు రజత పతకాలు సాధించి రికార్డు సాధించారు. అమెరికా, కెనడా, ఆ స్ట్రేలియాతో పాటు పలు యూరప్ దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ ఈత పోటీల్లో తొలి ప్రయత్నంలోనే చైతన్య ఆరు పతకాలు సాధించడంపట్ల రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి, క్రీడల విభాగ అదనపు డిజి రాజీవ్ త్రివేదీ సంతోషం వ్యక్తం చేశారు.