శెట్టూరు : తల్లిదండ్రులు మందలించారన్న కారణంగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండల పరిధిలోని ఐదుకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. మాలేపల్లికి చెందిన అనంతమ్మ, చండ్రాయుడు ఐదుకల్లులో ఓ వ్యవసాయ తోటలో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో అనిల్(17) చివరి వాడు.ఇంటర్ వరకు చదువుకున్నాడు.
ఏ పని చేయకుండా మిన్నకుండేవాడన్నారు. కళాశాలకు వెళ్లి చదువుకోవాలని పలుమార్లు తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఇంట్లో ఖాళీగా ఉండి ఎలా సంపాదిస్తావని తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్ ఐదుకల్లులోని ఓ వ్యవసాయ తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శెట్టూరు ఎస్‌ఐ శ్రీకాంత్, ఏఎస్‌ఐ కుళ్లాయప్ప తెలిపారు.
యువకుడు ఆత్మహత్య
Published Tue, Nov 22 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
Advertisement
Advertisement