
అనిల్ కుమార్
సాక్షి, సిటీబ్యూరో: ‘దిశ’ అత్యాచారం తర్వాత ఫేస్‌బుక్‌లో ఆమెకు న్యాయం చేయాలని మద్దతుగా ఓ మహిళ పెట్టిన పోస్టుపై అసభ్యకర కామెంట్లు చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో అనిల్ కుమార్ అంబాలా డిసెంబర్ 1న ఈ కామెంట్ చేశాడని రాయదుర్గానికి చెందిన విజయా కేసరి అనే మహిళ ఈ నెల 2న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు ఫేస్‌బుక్ ఖాతా ఆధారంగా నిందితుడు నల్గొండ జిల్లా, గుండ్రంపల్లికి చెందిన అనిల్ కుమార్ అంబాలాగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment