ముంబై: మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు బృందం నుండి మంత్రి వర్గంలో కొత్తగా చేరిన అనిల్ భైడాస్ పాటిల్ సొంతూరు అమల్నెర్ తిరిగి వస్తున్న క్రమంలో ఆయనను స్వాగతించేందుకు స్కూలు పిల్లల్ని రోడ్డుకు ఇరువైపులా రెండు గంటల పాటు అమానుషంగా నిలబెట్టారు.
అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలోని ఒక వర్గం తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ బృందంలో అనిల్ భైడాస్ పాటిల్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనిల్ మొదటిసారి ఆయన సొంతూరు అమల్నెర్ తిరిగొస్తున్న నేపథ్యంలో ఆయనను స్వాగతించడానికి స్థానిక ఆశ్రమశాల పాఠశాల పిల్లల్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టారు ఆ స్కూలు టీచర్లు.
మంత్రి కాన్వాయ్ రావడం ఆలస్యం కావడంతో పిల్లలు అలాగే మంచినీళ్లు కూడా తాగడానికి లేనిచోట రెండు గంటలపాటు అలాగే కూర్చుని ఎదురుచూశారు. తీరా చూస్తే చాలాసేపు నిరీక్షణ తర్వాత వచ్చిన మంత్రి పిల్లలకు కనీసం అభివాదమైనా చేయకుండా వెళ్లిపోయారు.
మంత్రి గారిని స్వాగతించడానికి పిల్లల్ని నిలబెట్టడమేమిటని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పాటిల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లల పట్ల మంత్రి తీరు అమానుషమని దీనిపై వెంటనే విచారణ జరిపిస్తామని తెలిపారు జల్గావ్ జిల్లా అధికారులు. ఇదిలా ఉండగా తనకోసం చేసిన ఈ ఏర్పాట్ల గురించి తనకసలు తెలియదని అనిల్ పాటిల్ అన్నారు.
Ridiculous. Young school students made to sit on roadside for 2 hours to welcome newly sworn in NCP rebel minister Anil Patil, returning to his City Amalner in Maharashtra. pic.twitter.com/413bOMFQhd
— Nasreen Ebrahim (@EbrahimNasreen) July 9, 2023
ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్ గా మారిన రైల్వే స్టేషన్
Comments
Please login to add a commentAdd a comment