ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ముమ్మాలపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన అనిల్(20) అనే యువకుడు వేరుశెనగ పంటను ట్రాక్టర్‌లో గద్వాల్ మార్కెట్‌కు తరలిస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ముందు భాగంలో కూర్చొని ఉన్న అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.