సాక్షి, హైదరాబాద్: కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత పీఆర్వో రాజేష్,ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. సోమవారం హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఐదుగురు సెల్‌ఫోన్లు ఈడీ అధికారులు సీజ్ చేశారు.
కాగా, లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది.
ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది.
కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే?
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు
- సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారు
- ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే
- ఆమ్ అద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు
- మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు
- కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు
- పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు
- అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు
- ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు
- కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు
- సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు
- మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు
- రూ. 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది.
ఇదీ చదవండి: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Comments
Please login to add a commentAdd a comment