
ప్రేమభిక్ష పెట్టింది ఎవరు?
అనిల్, శ్రుతిలయ జంటగా ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు నిర్మిస్తున్న సినిమా ‘ప్రేమభిక్ష’.
అనిల్, శ్రుతిలయ జంటగా ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు నిర్మిస్తున్న సినిమా ‘ప్రేమభిక్ష’. ప్రస్తుతం కర్ణాటకలోని కోలార్‌లో షూటింగ్ జరుగుతోంది. నవంబర్‌లో పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘అనంతపురంలోని భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా చిత్రం రూపొందుతోంది.
యువ జంట ప్రేమకు అడ్డు నిలిచింది ఎవరు? ప్రేమభిక్ష పెట్టింది ఎవరు? అనేది ఆసక్తికరం. సీనియర్ నటుడు సుమన్, షఫీ, దేవిశ్రీ గురూజీల నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: ప్రమోద్, సంగీతం: ఘంటాడి కృష్ణ.