సైకో థ్రిల్లర్‌ | Sri Sri Sri Film Productions New Movie launched | Sakshi
Sakshi News home page

సైకో థ్రిల్లర్‌

Published Sat, Nov 28 2020 6:08 AM | Last Updated on Sat, Nov 28 2020 6:08 AM

Sri Sri Sri Film Productions New Movie launched - Sakshi

అనిల్, జాస్మిన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపాల్‌ రెడ్డి కాచిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ శ్రీ శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై టీఎమ్‌ఎస్‌ ఆచార్య నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆధ్యాత్మిక గురువు హరిప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్‌ కొండేటి క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎమ్‌ఎస్‌ ఆచార్య మాట్లాడుతూ– ‘‘ఆసక్తికర కథతో గోపాల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా ఇది మా మొదటి ప్రయత్నం’’ అన్నారు. ‘‘ఆసక్తికరమైన మలుపులతో సాగే సైకో థ్రిల్లర్‌ చిత్రమిది’’ అన్నారు గోపాల్‌ రెడ్డి కాచిడి. ‘‘నాకు హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు థ్యాంక్స్‌’’ అన్నారు అనిల్‌. ‘‘తెలుగులో ఇది నా రెండో సినిమా’’ అన్నారు సబీనా జాస్మిన్‌. ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమెరా: సీతా రామాంజనేయులు ఉప్పతల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement