ప్రేమ పెళ్లి వ్యవహారంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది.
ముషీరాబాద్ : ప్రేమ పెళ్లి వ్యవహారంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా ముషీరాబాద్ మండలం కుర్విచెడ్ గ్రామంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ సంఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్ ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.... మండలంలోని కుర్విచెడ్ గ్రామానికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని మంగళవారం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఈ విషయంపై ఇరు కుటుంబాల సభ్యులు మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఘర్షణ పడ్డారు. యువతి తరపు బంధువులు వెంకటేశ్, సూరి కలసికట్టుగా అనిల్ ఇంపై దాడి చేశారు. ఆ క్రమంలో అనిల్ నాయనమ్మ సాయమ్మపై వారు గొడ్డలితో దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన రమ్యకృష్ణ, పద్మమ్మ అనే మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తాండూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.