
'సారికను చంపినవాళ్లను అలాగే చంపాలి'
వరంగల్: తన కూతురు సారికను, తన మనవళ్లను చంపినవాళ్లను అలాగే చంపాలని సారిక తల్లి అన్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె చెప్పారు. బుధవారం తెల్లవారుజామున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.
తన కూతుర్ని, మనవళ్లను చిత్ర హింసలు పెట్టి హత్య చేశారని సారిక తల్లి ఆరోపించారు. రాజయ్య కొడుకు అనిల్ రెండో పెళ్లి చేసుకున్నాడని.. తన కూతురు, మనవళ్లను వైదొలగించుకోవడానికి వారి ప్రాణాలు తీశాడని సారిక తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. నిజామాబాద్ జిల్లా వడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన సారికను రాజయ్య కుమారుడు అనిల్ 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. సారిక, ఆమె కొడుకుల మరణవార్త తెలుసుకున్న సారిక పుట్టింటివారు వరంగల్ వచ్చారు.