వరంగల్: కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు చిన్నారుల సజీవదహనం ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి చేస్తున్న దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అయితే సారిక ఛాతీ భాగంలో ఓ ఎముక విరిగినట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారని సమాచారం. ఇద్దరు చిన్నారులు కాళ్లు సైతం విరిగినట్లు తెలుస్తోంది. అయితే వారు కాలిపోతుండగా ఎముకలు విరుగుతాయని కొందరు వైద్యులు అంటుండగా, బతికుండగానే ఆమెను ఎవరైనా గాయపరిచి ఉండొచ్చని మరికొందరు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆనంతరమే అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయన్న విషయం తెలిసిందే.