సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే జాతీయ రహదారి 202లో యాదగిరిగుట్ట నుంచి వరంగల్ వరకు నాలుగు లేన్ల హైవే విస్తరణ పనులకు అనుమతి లభించినట్టు ఎంపీ సిరిసిల్ల రాజయ్య తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటివిడతలో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు పనులు పూర్తయ్యూయన్నారు. యాదగిరిగుట్ట-వరంగల్ మధ్య 99 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1,486 కోట్లు మంజూరైనట్టు రాజయ్య తెలిపారు.