మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ పై గురువారం రెండవ అదనపు జిల్లా కోర్టు లో న్యాయమూర్తి రేణుక విచారణ చేపట్టారు.
గత నెల 4న సారిక, ఆమె ముగ్గురు కుమారుల మతి ఘటనపై సుబేదారీ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో ప్రధాన నిందితుడు అనిల్‌కుమార్, రాజయ్య దంపతులు, సనా ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నసంగతి తెలిసిందే. బెయిల్ కోసం రాజయ్య, ఆయన భార్య గతంలోనే వేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ప్రధాన నిందితుడు అనిల్‌కుమార్ మొదటిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, రాజయ్య దంపతులు రెండోసారి బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ రెండు పిటిషన్లను విచారించిన కోర్టు తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.