
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్ పేపర్ లీకేజీ కేసులో నిందితురాలు(ఏ3) రేణుకకు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు రూ.50వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. రేణుకతో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఏ12 డి.రమేష్, ఏ13 ప్రశాంత్ రెడ్డిలకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది.
బెయిల్ పొందిన ఈ ముగ్గురి నిందితుల పాస్‌పోర్టు సీజ్ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మూడ నెలల వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ కార్యలయంలో హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈమేరకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కాగా.. రేణుక గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఆమెకు ఊరటనిచ్చింది.
(చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు)
Comments
Please login to add a commentAdd a comment