
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ కేసులో 7 మంది నిందితులకు ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. నాంపల్లి కోర్టు శుక్రవారం ముద్దాయిందరినీ ఎగ్జామినేషన్ కొరకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
అయితే కోర్టు ఆదేశాలను నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరుకాలేదు. విచారణకు గైర్హాజరైన నిందితులు.. గైర్హాజరు పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే నిందితులుకు అనుమతి నిరాకరిస్తూ వారిపై నాంపల్లి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment