సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసుపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. కోర్టులో విచారణకు 37 మంది నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, డాఖ్యానాయక్, రాజేశ్వర్ తో పాటు మిగతా నిందితుల హాజరయ్యారు. గత నెలలో ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ అధికారులు.. ప్రాథమిక అభియోగ పత్రంలో 37 మందినీ నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 105 మందిని సిట్ అరెస్ట్ చేసింది.
త్వరలో సిట్ అధికారులు త్వరలో మిగతా నిందితులతో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. కాగా పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ మినహా ఇప్పటికే మిగతా నిందితులందరికీ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా ఇక పేపర్ లీకేజ్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్ తేల్చింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రవీణ్ పేపర్‌ను తీసుకొని ఆమె డైరీలో ఉన్న సాస్‌వర్డ్, యూజర్‌నేమ్ ద్వారా పేపర్ లీక్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
చదవండి: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment