పేపర్‌ లీక్‌ కేసు: సిట్‌ కస్టడీ రిపోర్ట్‌లో కీలకాంశాలు | TSPSC Paper Leak Case: Nampally Court Allow 4 Accused To SIT Custody | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసు: సిట్‌ కస్టడీ రిపోర్ట్‌లో కీలకాంశాలు

Published Sat, Mar 25 2023 6:10 PM | Last Updated on Sat, Mar 25 2023 9:14 PM

TSPSC Paper Leak Case: Nampally Court Allow 4 Accused To SIT Custody - Sakshi

ఏడుగురిలో నలుగురు నిందితులను మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ.. 

సాక్షి, హైదరాబాద్‌:  టీఎస్‌పీఎస్సీ TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను మాత్రమే అదీ మూడు రోజుల సిట్‌ కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు. శనివారం సాయంత్రం ఈ కేసులోని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి.. ఆరు రోజుల కస్టడీకి కోరింది సిట్‌. అయితే..

ఈ కేసులోని ఏ -1 ప్రవీణ్,ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్ నిందితులను మాత్రమే సిట్‌ కస్టడీ అనుమతించింది కోర్టు. దీంతో రేపటి నుంచి మంగళవారం వరకు వీళ్లను కస్టడీకి తీసుకుని విచారించనున్నారు సిట్‌ అధికారులు. అయితే మిగిలిన ముగ్గురు(ఏ-10 షమీమ్, ఏ -11, సురేష్, ఏ -12 రమేష్) కస్టడీ పిటిషన్‌ను మాత్రం సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. 

కస్టడీ రిపోర్ట్‌లో కీలకాంశాలు

ఇక పేపర్‌ లీకేజీ కేసులో.. సిట్‌ కస్టడీ రిపోర్ట్‌లో కీలకాంశాలను పేర్కొంది. ‘‘నిందితులు విచారణకు సహకరించడం లేదు. పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో.. చైన్‌ ప్రాసెస్‌పై నోరు మెదపడం లేదు. కేవలం ముగ్గురి పేర్లే చెప్పారు. ఇందులో మిగతా వారి పాత్ర కూడా బయటపడాలి. నిందితులు వాడిన పరికరాలపై ప్రశ్నించాలి. 

ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. షమీమ్‌, రమేశ్‌, సురేష్‌లను అరెస్ట్‌ చేశాం. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో.. ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు. కాబట్టి.. నిందితుల కస్టడీ అత్యంత కీలకం అని పేర్కొంది. ఇక నిందితులలో నలుగురిని.. నాంపల్లి కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిదని సిట్‌ అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement