చౌళ్లపల్లి(ఆత్మకూరు), న్యూస్‌లైన్ : ఊపిరితిత్తులకు సంబంధించిన పల్మనరీ హైపర్ టెన్షన్ అనే వ్యాధికి మందును కనుగొని జర్మనీలో ఉత్తమ యువసైంటిస్ట్ అవార్డు అందుకున్న మండలంలోని చౌళ్లపల్లికి చెందిన సవాయి రాజ్‌కుమార్, ఆయన సతీమణి సోనీని గ్రామప్రజలు, ప్రముఖులు ఆదివారం ఘనంగా సన్మానించారు. సర్పంచ్ కుక్కముడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథిగా వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరై మాట్లాడుతూ వరంగల్ కీర్తిని ప్రపంచానికి చాటిన ఘనత యువసైంటిస్టు దంపతులు సవాయి రాజ్‌కుమార్, సోనీలదేనని అన్నారు.
దేశంలో వరంగల్‌కు ఎంతో ప్రాముఖ్యముంద ని ఈ కీర్తిని మరింత పెంచడంలో ఈ శాస్త్రవేత్తలు కృషి చేశారని అన్నారు. పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు పరిశోధనకు అధిక మొ త్తంలో నిధులు కేటాయించాలని అన్నారు. టీ డీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్లా ధర్మారెడ్డి, పీసీసీ అధికారప్రతినిధి సాంబారి సమ్మారావు, ఐఎంఏ రాష్ట్రఅధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి యువసైంటిస్టుల సేవలను కొనియాడారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో వైద్యసేవలకు తగిన ప్రాధాన్యం కల్పించాలన్నారు. సన్మాన కార్యక్రమంలో లింగారెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రావు, ప్రొఫెసర్ సురేందర్‌కుమార్, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు రవీందర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులకు పాదాభివందనం..
సన్మాన గ్రహీత రాజ్‌కుమార్ తన భార్యతో కలిసి తల్లిదండ్రులు సవాయి అయిలయ్య, కొంరమ్మ, అన్నలు రవి, శ్రీనివాస్‌కు పాదాభివందనం చేశారు. తాము ఈ స్థాయికి ఎదగడానికి తమ తల్లిదండ్రులు, అన్నలే కారణమని రాజ్‌కుమార్‌లిపారు.