Young scientists
-
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్‌ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్‌ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్‌లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్‌గా తెలుసుకునే విధంగా హ్యూమన్‌లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్‌లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్‌లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్‌లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్‌లోని యూసీ డేవిస్‌లో పూర్తి చేసి హైదరాబాద్‌లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్‌ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్‌తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్‌ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్‌గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్‌కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
పీఎస్ఎల్వీ–సీ51 ప్రయోగంలో తిరుపతి విద్యార్థులు
యూనివర్సిటీ క్యాంపస్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ51 ఉపగ్రహ ప్రయోగంలో తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థులు యజ్ఞసాయి, రఘుపతి భాగస్వాములయ్యారు. మరో ఐదుగురితో కలిసి వారిద్దరూ రూపొందించిన సతీష్ ధావన్ శాట్.. పీఎస్ఎల్వీ–సీ51 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 1.9 కిలోల బరువున్న శాట్ కోసం వీరు దాదాపు 4 నెలలపాటు శ్రమించారు. ఏరోస్పేస్లో ఇంజనీరింగ్ చేసిన యజ్ఞసాయికి ఇది మూడో ఉపగ్రహం కాగా రఘుపతికి తొలి ఉపగ్రహం. తిరుపతికి చెందిన కంబాల రాము, వాణిల కుమారుడు కె.యజ్ఞసాయి తన విద్యాభ్యాసమంతా తిరుపతిలోనే పూర్తి చేశాడు. చెన్నైలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఈ సమయంలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ నాసాకు వెళ్లే అవకాశం కల్పించింది. దీంతో తన డిగ్రీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కు మార్చుకున్నాడు. కలాం శాట్, కలాం శాట్ వీ2 ఉపగ్రహాల తయారీలో పాలుపంచుకున్నాడు. తిరుపతికి చెందిన ఫళణి(హమాలీ), మంజుల కుమారుడైన రఘుపతి ఎంటెక్ చేశాడు. అవకాశం ఇలా.. అంతరిక్షం పట్ల ఆసక్తి కలిగినవారికి చెన్నైకి చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ శిక్షణ ఇస్తుంది. ఆ సంస్థ సీఈవో శ్రీమతి కేశన్ ప్రోత్సాహంతో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. తాజాగా పంపిన సతీష్ ధావన్ శాట్ భూమికి 530 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో తిరుగుతుంది. తక్కువ శక్తితో ఎక్కువ డేటాను సమర్థవంతంగా ఉపయోగించే పరిశోధనలు చేస్తుంది. సతీష్ ధావన్ శాట్ ఉపగ్రహం -
ఇద్దరు యువ శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో పరిశోధనలకుగానూ విశేష కృషి చేస్తున్న ఇద్దరు యువ శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు దక్కాయి. ఆహారోత్పత్తి పంటలు, హార్టికల్చర్ సైన్స్ విభాగంలో పరిశోధనలకుగానూ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐఐఆర్ఆర్)లో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఎం.సతేంద్రకుమార్కు లాల్‌బహదూర్ శాస్త్రి యువ శాస్త్రవేత్త అవార్డు దక్కింది. అలాగే బయోటెక్నాలజీ విభాగంలో డాక్టోరల్ థీసెస్, అల్లైడ్ సైన్స్‌లో పరిశోధనలకుగానూ పటాన్‌చెరులోని ఐసీఆర్ఐఎస్ఏటీలో పనిచేస్తున్న యువ శాస్త్రవేత్త డా.బి.శైలజాకు జవహార్‌లాల్ నెహ్రు అవార్డు వరించింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఈ అవార్డులు వారికి అందజేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో పరిశోధనలు చేస్తున్న యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. -
యాప్‌లకు భద్రత ఏదీ?
వీటి నుంచి లావాదేవీలతో మోసాలు అధికం ∙యాప్‌లకు భద్రతా సర్టిఫికెట్లు కావాల్సిందే.. జాతీయ స్థాయిలో ఏజెన్సీ ఏర్పాటు చేయాలి ∙సైబర్ నేరాలపై నిపుణుల అభిప్రాయాలు (తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : క్యాష్తో పనేంటి?.. నగదు రహిత లావాదేవీలకు ఎన్ని మార్గాలు లేవు... ఒక్క క్లిక్‌తో క్షణంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయొచ్చు.. పెద్దనోట్ల రద్దు తర్వాత తెరమీదకొచ్చిన కొత్త మంత్రమిది. కేంద్రంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే జపం చేస్తున్నాయి. గల్లీ షాపు మొదలుకొని ఢిల్లీ వరకూ ప్రతీ షాపులోనూ రకరకాల యాప్‌లు కన్పిస్తున్నాయి. వాటి ముందు మొబైల్ పెడితే ఇట్టే కోడ్ తీసుకుని లావాదేవీ జరిగిపోతుంది. సౌకర్యం బాగానే ఉంది. కానీ దీనివల్ల ఎదరయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కాదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం భద్రత ప్రమాణాలే లేని వీటి నుంచి లావాదేవీలు చేస్తే రకరకాల మోసాలు జరగొచ్చని చెబుతున్నారు. వ్యక్తిగత సమాచారమే హరించుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. మనిషి జన్మించినా.. మరణించినా సర్టిఫికెట్ తప్పనిసరి. కానీ లక్షల కోట్ల లావాదేవీలు చేస్తూ.. కోట్లాది మంది ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు, యాప్‌లకు ఎందుకు భద్రత సర్టిఫికేట్లు అక్కర్లేదని ప్రశ్నిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న సైబర్ నేరాలపై యువ శాస్త్రవేత్తలు విరుచుకుపడాలని, సైబర్ ఉగ్రవాదాన్ని కట్టడి చేసే దిశగా పరిశోధనలు జరగాలని సూచిస్తున్నారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ‘సైబర్ సెక్యూరిటీ’ అనే అంశంపై శనివారం ఓ సెమినార్ జరిగింది. పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. సెమినార్లో ఎవరేం మాట్లాడారంటే... సెక్యూరిటీ ఏదీ? మొబైల్ ఫోన్లు కొంటాం. దానికి రేడియేషన్ లేదని సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఆ ఫోన్ సేఫ్ అని మాత్రం తయారీ సంస్థగానీ, మరే ఇతర ఏజెన్సీగానీ గ్యారెంటీ ఇవ్వదు. ఆ మొబైల్ నుంచి జరిగే లావాదేవీలు, పాస్వర్డ్స్ వేరే వాళ్ల చేతికి వెళ్లవన్న భరోసా ఇవ్వరు. కానీ అమెరికాలో ఈ సిస్టమ్ లేదు. కచ్చితంగా సెక్యూరిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. సెక్యూరిటీ ప్రమాణాల కోసం జాతీయ స్థాయిలో ఓ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. – నరేంద్రనాథ్, టెలీ కమ్యూనికేషన్ డిప్యూటీ డైరెక్టర్ సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరగాలి పెద్దనోట్ల రద్దు తర్వాత అనేక యాప్స్, వాలెట్స్ ప్రజల్లో విస్తృత ప్రచారం పొందాయి. వ్యక్తిగత సమాచారం ఎవరైనా దొంగిలించరని నమ్మకం ఏమిటి? అందుకే ప్రభుత్వ పరంగానే ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇలాంటి వాటి నుంచి వినియోగదారులకు భద్రత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరగాలి. – ఎన్ బాలకృష్ణన్, ఐఐటీ కంప్యూటర్ శాస్త్రవేత్త నెట్వర్క్ ట్రాఫిక్ పెరిగింది.. సదుపాయాలేవీ? ఒక చిన్న రోడ్డులోకి జాతీయ రహదారి నుంచి వెళ్లే వాహనాలను దారి మరలిస్తే ఎలా ఉంటుంది? ఇండియాలో పరిస్థితి ఇదే. లావాదేవీలు విపరీతంగా పెరిగినా... నెట్‌వర్క్‌లో మౌలిక సదుపాయాలు లేవు. మరో 20 ఏళ్లకు సరిపడా నెట్‌వర్క్‌ను అంచనా వేసి, అందుకు తగ్గట్టు నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి విస్తృత పరిశోధనలు జరగాలి. – ఎస్వీ రాఘవన్, చీఫ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కియాలజిస్ట్, చెన్నై -
యువ శాస్త్రవేత్తల సందడి
చౌటుప్పల్ : దేశంలోని వివిధ కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన 22మంది యువ శాస్త్రవేత్తలు శుక్రవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం తాళ్లసింగారం గ్రామాన్ని సందర్శించారు. తాళ్లసింగారం జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థ(నార్మ్) దత్తత గ్రామం. ఈ సంస్థలో శిక్షణ పొందేందుకు వచ్చిన పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, కేరళ, జార్ఖండ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని కేవీకేలలో అభ్యసిస్తున్న యువ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఈ గ్రామాన్ని సందర్శించారు. శాస్త్రవేత్తలు బృందాలుగా విడిపోయి ఇంటింటా తిరిగారు. ఒక్కో కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. ఎంత వరకు చదివారు.. ఏం పని చేస్తున్నారు.. ఎంత భూమి ఉంది.. ఏయే పంటలు పండి స్తున్నారు.. పంటల యాజమాన్య పద్ధతులు అవలంబిస్తున్నారా.. గ్రామ ప్రజల జీవన స్థితిగతులు ఏమిటి.. పండించిన పంటలకు మార్కెటింగ్ వసతులు ఎలా ఉన్నాయి.. మద్దతు ధర గిట్టుబాటు అవుతుందా.. అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డును సందర్శించారు. మార్కెట్లో రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారని అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.సంధ్యాసెనాయ్, డాక్టర్ వీకేజే.రావు, రవీందర్, సర్పంచ్ సుర్వి నర్సింహ్మగౌడ్ తదితరులున్నారు. -
ఎడ్యు న్యూస్
యంగ్ సైంటిస్ట్లకు 50 శాతం పెరిగిన రీసెర్చ్ స్కాలర్షిప్స్ దేశంలో యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలో ్ల రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీసెర్చ్ స్కాలర్స్, రీసెర్చ్ అసోసియేట్స్‌కు ప్రస్తుతం ఇస్తున్న ఫెలోషిప్లను దాదాపు 50 శాతం మేర పెంచుతూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా పలు విభాగాల్లో దాదాపు లక్ష మంది రీసెర్చ్ స్కాలర్స్ లబ్ధి పొందనున్నారు. తాజా నిర్ణయం ప్రకారం.. రీసెర్చ్ అసోసియేట్-3 కేటగిరీలో ప్రస్తుతమున్న రూ. 24 వేల ఫెలోషిప్ రూ. 46 వేలకు; రీసెర్చ్ అసోసియేట్-2 కేటగిరీలో రూ. 23 వేల నుంచి 42 వేలకు; రీసెర్చ్ అసోసియేట్-1 కేటగిరీలో రూ. 22 వేల నుంచి రూ. 38 వేలకు పెరుగుతుంది. అదే విధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మొత్తం కూడా రూ. 16 వేల నుంచి రూ. 25 వేలకు పెరిగింది. ఏఐసీటీఈలో మార్పులపై కమిటీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్.. దేశంలో సాంకేతిక, ప్రొఫెషనల్ విద్యా సంస్థలను పర్యవేక్షించే సంస్థ. సిలబస్, ఇతర బోధన విధి విధానాలను రూపొందించే నియంత్రణ వ్యవస్థ. ఏఐసీటీఈ విధానాల కారణంగా సాంకేతిక విద్య లో విద్యార్థులకు.. పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలు లభించట్లేదనే వాదనల నేపథ్యంలో.. దిద్దుబాటు చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏఐసీటీఈని పునర్వ్యవస్థీకరించి.. సాంకేతిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా సాంకేతిక విద్యా విధానాన్ని రూపొందించేందుకు రివ్యూ కమిటీని నియమించింది. కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ కార్యదర్శి ఎం.కె.కా నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ ఆరునెలల్లోపు నివేదిక అందించనుంది. -
యువ సైంటిస్టులకు ఘన సన్మానం
చౌళ్లపల్లి(ఆత్మకూరు), న్యూస్‌లైన్ : ఊపిరితిత్తులకు సంబంధించిన పల్మనరీ హైపర్ టెన్షన్ అనే వ్యాధికి మందును కనుగొని జర్మనీలో ఉత్తమ యువసైంటిస్ట్ అవార్డు అందుకున్న మండలంలోని చౌళ్లపల్లికి చెందిన సవాయి రాజ్‌కుమార్, ఆయన సతీమణి సోనీని గ్రామప్రజలు, ప్రముఖులు ఆదివారం ఘనంగా సన్మానించారు. సర్పంచ్ కుక్కముడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథిగా వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరై మాట్లాడుతూ వరంగల్ కీర్తిని ప్రపంచానికి చాటిన ఘనత యువసైంటిస్టు దంపతులు సవాయి రాజ్‌కుమార్, సోనీలదేనని అన్నారు. దేశంలో వరంగల్‌కు ఎంతో ప్రాముఖ్యముంద ని ఈ కీర్తిని మరింత పెంచడంలో ఈ శాస్త్రవేత్తలు కృషి చేశారని అన్నారు. పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు పరిశోధనకు అధిక మొ త్తంలో నిధులు కేటాయించాలని అన్నారు. టీ డీపీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా ధర్మారెడ్డి, పీసీసీ అధికారప్రతినిధి సాంబారి సమ్మారావు, ఐఎంఏ రాష్ట్రఅధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి యువసైంటిస్టుల సేవలను కొనియాడారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో వైద్యసేవలకు తగిన ప్రాధాన్యం కల్పించాలన్నారు. సన్మాన కార్యక్రమంలో లింగారెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ రవీందర్రావు, ప్రొఫెసర్ సురేందర్‌కుమార్, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్రావు, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు రవీందర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు పాదాభివందనం.. సన్మాన గ్రహీత రాజ్‌కుమార్ తన భార్యతో కలిసి తల్లిదండ్రులు సవాయి అయిలయ్య, కొంరమ్మ, అన్నలు రవి, శ్రీనివాస్‌కు పాదాభివందనం చేశారు. తాము ఈ స్థాయికి ఎదగడానికి తమ తల్లిదండ్రులు, అన్నలే కారణమని రాజ్కుమార్లిపారు.