యంగ్ సైంటిస్ట్‌లకు 50 శాతం పెరిగిన రీసెర్చ్ స్కాలర్‌షిప్స్
దేశంలో యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలో ్ల రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీసెర్చ్ స్కాలర్స్, రీసెర్చ్ అసోసియేట్స్‌కు ప్రస్తుతం ఇస్తున్న ఫెలోషిప్‌లను దాదాపు 50 శాతం మేర పెంచుతూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా పలు విభాగాల్లో దాదాపు లక్ష మంది రీసెర్చ్ స్కాలర్స్ లబ్ధి పొందనున్నారు. తాజా నిర్ణయం ప్రకారం.. రీసెర్చ్ అసోసియేట్-3 కేటగిరీలో ప్రస్తుతమున్న రూ. 24 వేల ఫెలోషిప్ రూ. 46 వేలకు; రీసెర్చ్ అసోసియేట్-2 కేటగిరీలో రూ. 23 వేల నుంచి 42 వేలకు; రీసెర్చ్ అసోసియేట్-1 కేటగిరీలో రూ. 22 వేల నుంచి రూ. 38 వేలకు పెరుగుతుంది. అదే విధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మొత్తం కూడా రూ. 16 వేల నుంచి రూ. 25 వేలకు పెరిగింది.
ఏఐసీటీఈలో మార్పులపై కమిటీ
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్.. దేశంలో సాంకేతిక, ప్రొఫెషనల్ విద్యా సంస్థలను పర్యవేక్షించే సంస్థ. సిలబస్, ఇతర బోధన విధి విధానాలను రూపొందించే నియంత్రణ వ్యవస్థ. ఏఐసీటీఈ విధానాల కారణంగా సాంకేతిక విద్య లో విద్యార్థులకు.. పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలు లభించట్లేదనే వాదనల నేపథ్యంలో.. దిద్దుబాటు చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏఐసీటీఈని పునర్‌వ్యవస్థీకరించి.. సాంకేతిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా సాంకేతిక విద్యా విధానాన్ని రూపొందించేందుకు రివ్యూ కమిటీని నియమించింది. కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ కార్యదర్శి ఎం.కె.కా నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ ఆరునెలల్లోపు నివేదిక అందించనుంది.
ఎడ్యు న్యూస్
Published Mon, Nov 3 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement
Advertisement