‘మరో 10 మంది వచ్చినా ఆశ్చర్యం లేదు’ | Minister Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే టీడీపీ దుష్ప్రచారం

Published Fri, Mar 13 2020 2:58 PM | Last Updated on Fri, Mar 13 2020 3:17 PM

Minister Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: ఓటమి భయంతోనే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్రలన్నీ ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. మీడియాలో కనిపించకపోతే ఆయనకు నిద్రపట్టదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై అన్నివర్గాలు సంతృప్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. (బాబు ఎంతకైనా దిగజారతాడు : విజయసాయిరెడ్డి)

బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డారు..
చంద్రబాబుకు వత్తాసు పలికే పత్రికలు అసత్య కథనాలు రాస్తున్నాయని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు మోకాలడ్డారని ధ్వజమెత్తారు. ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు పిటిషన్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో రకంగా అభివృద్ధిని అడ్డుకునేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబును నిజ జీవితంలో మహా నటుడిగా మంత్రి పెద్దిరెడ్డి అభివర్ణించారు. గవర్నర్‌ను కలిసి ఆయన అసత్యాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. (కడపలో టీడీపీకి మరో బిగ్‌షాక్‌)

ఆ పరిస్థితికి టీడీపీ దిగజారింది..
సీఎం జగన్‌ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితికి టీడీపీ దిగజారిందని ఆయన విమర్శించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని.. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు విబేధాలు సృష్టిస్తున్నారు.
ఉగాది నాడు 25 లక్షలు మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు. ఈసీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని వికేంద్రీకరణతో​ అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రాంతాల వారీగా చంద్రబాబు విబేధాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చూసి రాష్ట్రంలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదాను కూడా నిలుపుకునేటట్లు లేరని.. టీడీపీ నుంచి  మరో  10 మంది ఎమ్మెల్యేలు వచ్చిన ఆశ్చర్యం లేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement