సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణ జరపమని చంద్రబాబు అడగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గతంలో కూడా దివంగత నేత వైఎస్సార్‌పై కూడా ఇలానే ఆరోపణలు చేశారన్నారు. ఆనాడు ఫోన్ ట్యాపింగ్‌ను నిరూపించలేకపోయారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. (ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ 20 కి వాయిదా)
‘‘చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఎందుకు విచారణ చేయలేదు. కేసీఆర్‌కు భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుండి పారిపోయారు. రాత్రికి రాత్రి విజయవాడ వచ్చేసి రాష్ట్రానికి ద్రోహం చేశారు. ఇప్పుడేమో హైదరాబాద్‌లో దాక్కుని మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని’’ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఎందుకు పారిపోయారో ఆయన వర్గం మీడియా ప్రశ్నించాలని మంత్రి పెద్దిరెడ్డి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment