సాక్షి, కాకినాడ : టీడీపీలో జాతీయ అధ్యక్షుడికి, రాష్ర్ట అధ్యక్షుడి మాటలకు పొంతనే లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. 'కరోనా లేదు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అచ్చెంనాయుడు అంటే..కోవిడ్ రెండవ దశలో ఉందని చంద్రబాబు అంటున్నారు. జాతీయ అధ్యక్షుడు చెప్పింది రాష్ట్ర అధ్యక్షుడు ఫాలో అవుతాడా? లేక రాష్ట్ర అధ్యక్షుడు చెప్పింది జాతీయ అధ్యక్షుడు ఫాలో అవుతున్నాడో అర్ధం కావడం లేదు. 26 కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు ఆపేస్తే నిమ్మగడ్డను ప్రశంసించారు. ఇప్పుడు రోజుకు 26 వేలకు పైగా కేసులు నమోదు అవుతుంటే మాత్రం టీడీపీకి, నిమ్మగడ్డకు ఎన్నికలు నిర్వహించాలన్న తొందర ఎందుకు వచ్చింది? చంద్రబాబు కార్యాలయం నుండి నిమ్మగడ్డకు ఆదేశాలు వస్తాయి. ఆ ఆదేశాలను నిమ్మగడ్డ పాటిస్తారు. ప్రజల్ని మోసగించడంలో పేటెంట్ తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు' అని వేణుగోపాల కృష్ణ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment