venugopal krishna
-
రాష్ట్ర విభజనకు చంద్రబాబు ముఖ్య కారకుడు అయ్యాడు: వేణుగోపాలకృష్ణ
-
చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా ?
-
సొంత అన్నపై ఆరోపణలు చేయడం దారుణం- మంత్రి వేణుగోపాల్
-
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది
-
కులగణన జరిపిస్తానని సీఎం జగన్ చెప్పారు
-
ముంపు ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ సర్వే
సాక్షి, రాజమహేంద్రవరం/పాడేరు: భారీ వర్షాలు, గోదావరి వరద కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా తూర్పు గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిందన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించామన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేశారని, వరదలకు సంబంధించి సమగ్రమైన నివేదికను అధికారుల ద్వారా రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని చెప్పారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాల్లో ముంపు పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. మరో 48 గంటలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లంక గ్రామాల్లో చిక్కుకున్న 65 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంధాలు రక్షించాయని చెప్పారు. ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. బాధిత ప్రజలందరికీ సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరద పూర్తిగా తగ్గే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని, బియ్యం, ఇతర నిత్యావసరాలన్నింటిని పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే విధంగా అప్రమత్తం చేసామని మంత్రులు తెలిపారు. ఏరియల్ సర్వేలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. -
బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్ బోన్
-
టీడీపీకి, నిమ్మగడ్డకు ఎందుకంత తొందర?
సాక్షి, కాకినాడ : టీడీపీలో జాతీయ అధ్యక్షుడికి, రాష్ర్ట అధ్యక్షుడి మాటలకు పొంతనే లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. 'కరోనా లేదు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అచ్చెంనాయుడు అంటే..కోవిడ్ రెండవ దశలో ఉందని చంద్రబాబు అంటున్నారు. జాతీయ అధ్యక్షుడు చెప్పింది రాష్ట్ర అధ్యక్షుడు ఫాలో అవుతాడా? లేక రాష్ట్ర అధ్యక్షుడు చెప్పింది జాతీయ అధ్యక్షుడు ఫాలో అవుతున్నాడో అర్ధం కావడం లేదు. 26 కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు ఆపేస్తే నిమ్మగడ్డను ప్రశంసించారు. ఇప్పుడు రోజుకు 26 వేలకు పైగా కేసులు నమోదు అవుతుంటే మాత్రం టీడీపీకి, నిమ్మగడ్డకు ఎన్నికలు నిర్వహించాలన్న తొందర ఎందుకు వచ్చింది? చంద్రబాబు కార్యాలయం నుండి నిమ్మగడ్డకు ఆదేశాలు వస్తాయి. ఆ ఆదేశాలను నిమ్మగడ్డ పాటిస్తారు. ప్రజల్ని మోసగించడంలో పేటెంట్ తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు' అని వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. -
‘నిమ్మగడ్డ నిజస్వరూపం తెలిసిపోయింది’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజస్వరూపం అందరికి తెలిసిపోయిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘26 కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసి 26 వేల కేసులున్నప్పుడు పెడతామని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు కమిషన్ నిర్ణయం తీసుకోవడం సరికాదు అన్నారు. గతంలో వాయిదా వేసినప్పుడు ఎందుకు రాజకీయ పార్టీలతో చర్చించలేదు అని అన్నారు. అచ్చెన్నాయుడు పోలీస్‌లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. సోనియా గాంధీని ఢీకొని సింగిల్‌గా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. టీడీపీకి 50 నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లే లేరని, వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ‘వాళ్ళకి మేం భయపడేది ఏంటి’ అని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాలనతో టీడీపీకి ఓటేసేవాడే లేడని తేలిపోయిందన్నారు. చంద్రబాబు రాష్ట్రానికే రావట్లేదని, ఇక ఎన్నికల్లో వాళ్లెం చెయ్యగలరు అని అన్నారు. చదవండి: పేదల ద్రోహి చంద్రబాబు -
‘ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి’
సాక్షి, ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో చంద్రబాబు.. స్టేబాబులా మారాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చంద్రబాబు కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోయింది. చంద్రబాబు పార్టీ జామ్ అయిపోయి.. జూమ్ పార్టీలా మారిందని’’ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు ఎన్ని స్టేలు తెచ్చినా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పాన్ని అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: కోర్టులు ఎవరి ప్రయోజనాల కోసం?) తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు.. అమరావతి భూముల విషయంలో హైకోర్టు కెళ్ళి స్టే తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అలజడులను సృష్టించేందుకే.. ఒక కుట్రపూరితంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అవినితీని వెలికితేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. (చదవండి: చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారు..) -
కొత్త మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు
సాక్షి, అమరావతి : నూతన మంత్రులుగా నియమితులైన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయంలో ఛాంబర్ల కేటాయింపు జరిగింది. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ఛాంబర్‌ను అప్పలరాజుకు, మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఛాంబర్‌ను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. అలాగే డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ పాత ఛాంబర్లనే వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభకు ఎన్నికకావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గ విస్తరణ జరిపిన విషయం తెలిసిందే. -
బీసీలకు పెద్దపీట
-
ఏపీకి ఇద్దరు కొత్త మంత్రులు
-
మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం
సాక్షి, విజయవాడ : నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు మంత్రులతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ తదితరులు హాజరు అయ్యారు. అయితే కోవిడ్–19 నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలో నేతలు హాజరు అయ్యారు. (‘రాజు’ మంత్రి అయ్యారు! ) కాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక అవడంతో వారిరువురు మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలరాజు 2019లో తొలిసారిగా పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి అప్పలరాజుకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి తూర్పు గోదావరికి చెందిన చెల్లుబోయిన వేణుకు పదవి దక్కింది. (ఆ రెండు శాఖలూ సీఎం వద్దే) -
‘చంద్రబాబు.. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి’
సాక్షి, రామచంద్రాపురం : జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తూ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. వంద రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమి చేయలేదనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. వంద రోజుల్లో వైఎస్ జగన్ 119 విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని.. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలను మెరుగుపరచడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెల్లడించారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిర్వహించిన అవినీతి పాలనకు రివర్స్‌లో జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వంద రోజుల పాలనలో జగన్ చేసిందేమి లేదన్న వ్యాఖ్యలను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. -
హత్యకు కులం రంగు పూస్తున్నారు
-
'నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో ప్రభుత్వం వివక్ష'
హైదరాబాద్ : నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో వివక్ష చూపుతున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణా మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో వేణుగోపాలకృష్ణా విలేకర్లతో మాట్లాడుతూ... గతంలో ఆళ్లగడ్డలో గంగూల ప్రభాకర్‌రెడ్డి పేరిట నిధులు మంజూరు చేసి... ఇప్పుడు పార్టీ మారాక అఖిల ప్రియ పేరుతో నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. అలాగే గతంలో కడప జిల్లాలో జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి పేరుతో నిధులు విడుదల చేసి... ప్రస్తుతం పార్టీ మారిన ఆదినారాయణరెడ్డి పేరుతో నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఓ న్యాయం.... టీడీపీ ఎమ్మెల్యేలకు మరో న్యాయమా అని వేణుగోపాల్ కృష్ణా ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వేణుగోపాలకృష్ణా నిప్పులు చెరిగారు. చంద్రబాబు విధానాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వేణుగోపాలకృష్ణా ఆరోపించారు.