
సాక్షి, రామచంద్రాపురం : జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తూ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. వంద రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమి చేయలేదనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. వంద రోజుల్లో వైఎస్ జగన్ 119 విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని.. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలను మెరుగుపరచడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెల్లడించారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిర్వహించిన అవినీతి పాలనకు రివర్స్‌లో జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వంద రోజుల పాలనలో జగన్ చేసిందేమి లేదన్న వ్యాఖ్యలను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment