
సాక్షి, ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో చంద్రబాబు.. స్టేబాబులా మారాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చంద్రబాబు కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోయింది. చంద్రబాబు పార్టీ జామ్ అయిపోయి.. జూమ్ పార్టీలా మారిందని’’ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు ఎన్ని స్టేలు తెచ్చినా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పాన్ని అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: కోర్టులు ఎవరి ప్రయోజనాల కోసం?)
తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు.. అమరావతి భూముల విషయంలో హైకోర్టు కెళ్ళి స్టే తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అలజడులను సృష్టించేందుకే.. ఒక కుట్రపూరితంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అవినితీని వెలికితేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. (చదవండి: చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారు..)
Comments
Please login to add a commentAdd a comment