
సాక్షి, అమరావతి : నూతన మంత్రులుగా నియమితులైన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయంలో ఛాంబర్ల కేటాయింపు జరిగింది. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ఛాంబర్‌ను అప్పలరాజుకు, మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఛాంబర్‌ను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. అలాగే డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ పాత ఛాంబర్లనే వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభకు ఎన్నికకావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణ జరిపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment