సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంపై ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. 'సంఘాలుగా ఏర్పడింది నిమ్మగడ్డకు భజన చేసేందుకు కాదు.. ఉద్యోగుల హక్కుల కాపాడేందుకే ఏర్పడ్డాయి. ప్రభుత్వం చెబుతున్న వాదనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదో అర్థం కావడం లేదు. భయభ్రాంతులకు గురిచేసి ఉద్యోగులతో పనిచేయించలేరు. నిమ్మగడ్డ హెచ్చరికలకు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు.. ఉద్యోగులకు అండగా మేముంటాం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దురుద్దేశంతోనే నిమ్మగడ్డ ఉన్నారు. రాజ్యాంగం నిమ్మగడ్డ ఒక్కరికే కాదు.. ప్రతి పౌరుడికీ రాజ్యాంగ హక్కు ఉంది. ఉద్యోగుల పట్ల బెదిరింపు ధోరణి కుదరదు.. బెదిరించే తత్వాన్ని తాము ఎంత మాత్రం అంగీకరించం 'అని పేర్కొన్నారు.
(చదవండి: పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తాం: చంద్రశేఖర్ రెడ్డి)
'సంఘాలు ఏర్పడింది నిమ్మగడ్డ భజన కోసం కాదు'
Published Sat, Jan 23 2021 1:17 PM | Last Updated on Sat, Jan 23 2021 4:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment