andhra pradesh employees federation
-
ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సంబరాలు
-
ఈహెచ్ఎస్ మరింత పటిష్టం.. ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమును (ఈహెచ్ఎస్) మరింత పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి వైద్య బిల్లులను ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటో డెబిట్ స్కీము ద్వారా చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పీఆర్సీపై చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన మాట మేరకు ఇతర రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు అనుమతిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్య శ్రీలో చేర్చినా, ఎంప్లాయిస్ హెల్త్ స్కీములో కవర్ కాని 565 వైద్య విధానాలను ఇప్పుడు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకుంది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లను మరింత పటిష్టం చేస్తూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీము లబ్ధిదారులకు ఆరోగ్య మిత్రలు తగిన సహాయ సహకారాలు అందిస్తూ నగదు రహిత చికిత్సలు అందేలా చూస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు ఉత్తర్వుల్లో సూచించారు. ఉద్యోగులకు ఎంతో మేలు ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం 21 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని స్పష్టంగా పేర్కొనడంతో మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని ప్రధాన ఆస్పత్రులు ఈ స్కీమును అమలు చేస్తాయని పేర్కొన్నారు. 565 రకాల కొత్త వైద్య సేవల వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. -
'సంఘాలు ఏర్పడింది నిమ్మగడ్డ భజన కోసం కాదు'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంపై ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. 'సంఘాలుగా ఏర్పడింది నిమ్మగడ్డకు భజన చేసేందుకు కాదు.. ఉద్యోగుల హక్కుల కాపాడేందుకే ఏర్పడ్డాయి. ప్రభుత్వం చెబుతున్న వాదనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదో అర్థం కావడం లేదు. భయభ్రాంతులకు గురిచేసి ఉద్యోగులతో పనిచేయించలేరు. నిమ్మగడ్డ హెచ్చరికలకు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు.. ఉద్యోగులకు అండగా మేముంటాం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దురుద్దేశంతోనే నిమ్మగడ్డ ఉన్నారు. రాజ్యాంగం నిమ్మగడ్డ ఒక్కరికే కాదు.. ప్రతి పౌరుడికీ రాజ్యాంగ హక్కు ఉంది. ఉద్యోగుల పట్ల బెదిరింపు ధోరణి కుదరదు.. బెదిరించే తత్వాన్ని తాము ఎంత మాత్రం అంగీకరించం 'అని పేర్కొన్నారు. (చదవండి: పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తాం: చంద్రశేఖర్ రెడ్డి) -
స్తంభించిన బ్యాంకుల లావాదేవీలు
న్యూఢిల్లీ: వేతనాల సవరణ, ఇతర డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు బుధవారం ఒక రోజు సమ్మె చేశారు. దీంతో దేశవ్యాప్తంగా చెక్కుల క్లియరెన్సులు, డబ్బు డిపాజిట్లు, విత్‌డ్రాయల్ వంటి లావాదేవీలు స్తంభించాయి. అయితే ఏటీఎంలు మాత్రం పనిచేయంతో వినియోగ దారులకు కాస్త ఉపశమనం కలిగింది. బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (యూఎఫ్‌బీయూ)లోని 9 యూనియన్ల సభ్యులందరూ సమ్మెలో పాల్గొన్నారని ఆ సంఘం కన్వీనర్ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. నెల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) స్పందించలేదని, అందుకే సమ్మెకు దిగామన్నారు. వేతన సవరణపై ఐబీఏ ఈ నెల 14న యూఎఫ్‌బీయూతో చర్చలు జరిపిందని, అయితే వేతన వ్యయాలను అతితక్కువగా 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడంతో సమ్మె చేసినట్లు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి అశ్వనీ రాణా వెల్లడించారు. రాష్ట్రంలో సమ్మె విజయవంతం సాక్షి, హైదరాబాద్: బ్యాంకు యూనియన్లు ఇచ్చిన ఒక రోజు సమ్మె రాష్ట్రంలో విజయవంతం అయ్యింది. సుమారు 80వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ బి.ఎస్.రాంబాబు తెలిపారు. ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ధర్నాలో సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడమని రాంబాబు స్పష్టం చేశారు.