
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మంగళవారం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను ప్రభుత్వం 34 శాతం నుంచి 22శాతానికి తగ్గించిందని, ఈ నేపథ్యంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల మూడో తేదీన (గురువారం) తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ అంశంపై కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment