Panchayati elections
-
పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!...కచ్చితంగా షాక్ అవుతారు!!
ఇంతవరకు మనం చాలా ఎలక్షన్స్‌లో నిలబడ్డ నాయకులు వారికి వచ్చిన ఓట్లు గురించి విని ఉంటాం. అంతెందుకు చాలామంది కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన నాయకులను కూడా చూసి ఉంటాం. పోనీ ఎప్పుడూ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వచ్చే నాయకుడికి సైతం అత్యంత ధారుణంగా ఓట్లు వచ్చిన ఘటనలను చూసి ఉంటాం. కానీ గుజరాత్‌లోని ఒక వ్యక్తికి మాత్రం ఎంత ధారుణంగా ఓట్లు వచ్చాయంటే ఇప్పటి వరకు అన్ని ఓట్లు వచ్చి ఉండవు. (చదవండి: విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు) అసలు విషయంలోకెళ్లితే...గుజరాత్‌లోని వాపి జిల్లాలోని చర్వాలా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో సర్పంచి పదవికి సంతోష్ అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు ఎంతగానో మద్దతు ఇస్తారని సంతోష్ ఆశించారు. పైగా అతని కుటుంబంలోనే 12 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే తనకు ఒక్క ఓటు మాత్రమే వచ్చిందని తెలిసి సంతోష్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. పైగా సంతోష్ తన అభ్యర్థిత్వానికి కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వకపోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కోపంతో విరుచుకుపడ్డాడు. నిజానికి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఓటరు తన వార్డుకు సర్పంచ్‌ని ఎన్నుకోవడానికి ఒక ఓటు పంచాయతీ సభ్యులకు ఒక ఓటు అంటే మొత్తంగా ఎన్నుకునేందుకు రెండు ఓట్లు వేయాలి. (చదవండి: నిబంధనలకు విరుద్ధం!..జుట్టు కత్తిరించిన ప్రిన్స్‌పాల్) -
ఏపీ లో ప్రశాంతంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు
-
కథ ముగిసింది.. కల చెదిరింది
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 80 శాతం గ్రామాలను గెలుచుకుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆ పార్టీ సోషల్ ఇంజినీరింగ్ ఈ విజయానికి దోహదపడ్డాయి. అయితే, ఏ ఒక్క నియోజకవర్గంలోనూ టీడీపీ అధిక సర్పంచ్ పదవులను గెలుచుకుందని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో టీడీపీ గెలవడం కూడా ఓ అద్భుతమైన విషయంగా ప్రచారం చేసుకునే దుస్థితి ఆ పార్టీకి దాపురించింది. దీనికి విరుద్ధంగా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. ఈ ఊపు చూస్తుంటే వచ్చే మున్సిపల్, మండల, జడ్పీ ఎన్నికలతోపాటు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి తిరుగు ఉండదన్న భావన కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్ని కల ఘట్టం పూర్తయింది. పార్టీ రహిత ఎన్నికలే అయినా, గతంలో ఎన్నడూ లేనంత సీరియస్‌గా ఈసారి పార్టీలు పోటీపడ్డాయని చెప్పాలి. ఆయా పార్టీలు తమ మద్దతుదారులను రంగంలో దించి పంచాయతీలను గెలుచుకునే యత్నం చేశాయి. ఏ పార్టీ ఎన్ని పంచాయతీలు గెలిచిందన్న లెక్కలు ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఒక ప్రమాణం ఏమిటంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఒక వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా ప్రారంభించి, గ్రామాలలో గెలిచిన తమ పార్టీ మద్దతు దారుల ఫొటోలు, పేర్లు తదితర వివరాలను ఉంచడమే కాకుండా, వాటిలో తప్పుంటే చెప్పాలని సవాల్ చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయమై ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. కానీ తెలుగుదేశం వైపు నుంచి స్పందన లేదు. అయినా తాము ఇన్ని గెలిచాం అని ఏవో లెక్కలు చెప్పడం మానలేదు. చివరికి ప్రతిపక్ష నేత నియోజకవర్గం కుప్పంలో కూడా 74 పంచాయతీలను వైసీపీ గెలుచుకోవడం ఒక పెద్ద సంచలనం. మిగిలిన ఫలితాల సంగతి ఎలా ఉన్నా, ఈ ఒక్కటి చంద్రబాబును విపరీతంగా డ్యామేజీ చేసిందంటే ఆశ్చర్యం కాదు. నాలుగు దశలలో కలిపి 4,230 సర్పంచ్ పదవులు దక్కాయనీ, మొత్తం మీద నలభై శాతం పైగా గెలుచుకున్నామనీ మేకపోతు గాంభీర్యంతో చెప్పారు కానీ వాటికి నిర్దిష్ట ప్రాతిపదిక, ఆధారాలు చూపించలేకపోయారని అనిపిస్తుంది. అందులో ఏమాత్రం నిజం ఉన్నా, ఆయనకు మద్దతిచ్చే పత్రికలు, చానళ్లు జిల్లాలు, మండలాల వారీగా టీడీపీ విజయాలను ప్రచారం చేసి ఉండేవి. మొదటి దశల్లో టీడీపీ బాగా పుంజుకుందని ప్రచారం చేసిన ఈ మీడియా తన పరువు పోతోందని గ్రహించిందో, లేక మరే కారణమో తెలియదు గానీ ఇది టీడీపీ లెక్క, అది వైసీపీ లెక్క అంటూ ప్రచారం చేసి ఊరుకున్నాయి. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే చంద్ర బాబు స్వగ్రామం నారావారిపల్లెలో టీడీపీ గెలవడం అద్భుతమైన విషయమన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఒకటి వాస్తవమే. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆయన సొంత గ్రామంలో కూడా తెలుగుదేశం ఓడిపోతే మరింత నష్టం జరిగేది. అది జరగకుండా చంద్రబాబు కొంత జాగ్రత్తపడ్డారని అనుకోవాలి. అయితే అదే సమ యంలో చంద్రగిరి నియోజకవర్గంలో 90 శాతం పంచాయతీలు వైసీపీ వశం అవడం కూడా గమనించదగిన అంశమే అవుతుంది. రాష్ట్రంలో ఫలానా నియోజకవర్గంలో టీడీపీ అధిక సర్పంచ్ పద వులను గెలుచుకుందని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం 13,097 గ్రామాలకు ఎన్నికలు జరిగితే 10,382 సర్పంచ్ పదవులను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుందనీ, 2,062 గ్రామాలను టీడీపీ గెలుచు కుందనీ, 475 గ్రామాలలో ఇతర పార్టీలు విజయం సాధించాయని వైసీపీ పేర్కొంది. ఆరు నియోజకవర్గాలలో టీడీపీ ఒక్క సర్పంచ్ పద విని కూడా దక్కించుకోలేదు. 39 నియోజకవర్గాలలో పది లోపు గ్రామాలకే అది పరిమితం అయింది. చంద్రబాబు సైతం వైసీపీ మెజా రిటీ స్థానాలు గెలుచుకుందని పరోక్షంగా అంగీకరిస్తూనే, తమకు వచ్చిన స్థానాలను రెట్టింపు చేసి ప్రచారం చేసుకున్నట్లు కనిపిస్తుంది. తద్వారా పార్టీ ఉనికి రక్షించుకునే యత్నం చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో పార్టీ క్యాడర్ మరీ నీరుగారిపోకుండా ఉండటానికి ఆయన తంటాలు పడుతున్నారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ మంచి జోష్‌లో ఉంది. పల్లెల్లో వచ్చిన ఈ సానుకూల ఫలితాల ఊపుతో పట్టణాలలో కూడా పట్టు బిగిం చాలని ప్రయత్నాలు ఆరంభించింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం చెప్పుకోవాలి. రాజధాని ప్రాంతంగానో, పరిసర ప్రాంతంగానో పరి గణనలోకి తీసుకునే గుంటూరు, కృష్ణా జిల్లాలలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ అధిక స్థానాలలో జయకేతనం ఎగురవేసింది. గుంటూరు జిల్లాలో 744 గ్రామాలను వైసీపీ కైవసం చేసుకుంటే టీడీపీకి 162 మాత్రమే దక్కాయి. అలాగే కృష్ణా జిల్లాలో 680 గ్రామాలను వైసీపీ గెలుచుకుంటే టీడీపీ 168 గ్రామాలను దక్కించుకుంది. అమరావతి రాజధానికి ప్రజల పూర్తి మద్దతు ఉందని ఇంతకాలమూ టీడీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. ఎన్నికలకు రావాలని పలుమార్లు సవాల్ చేసింది. కానీ ఈ రెండు జిల్లాలలోనూ టీడీపీ ఆధిక్యత తెచ్చుకోలేక పోవడం దేన్ని సంకేతిస్తుంది? రాజధాని అమరావతి పేరుతో గతంలో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారమనీ, దానికి ప్రజల మద్దతు ఉందన్న వాదనలో వాస్తవం లేదనీ అర్థం అవుతోంది. అంతేగాక అమ రావతి మహోద్యమం అంటూ ప్రచారం చేసిన టీడీపీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు ఇది జీర్ణించుకోలేని విషయమే అవుతుంది. రాజధాని గ్రామాలు అధికంగా ఉండే తాడికొండ నియోజకవర్గంలో సైతం వైసీపీ ఎక్కువ పంచాయతీలను గెలుచుకుందన్న సమాచారం వచ్చింది. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో, దుగ్గిరాల మండలం లోనూ వైసీపీదే గెలుపు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ 696 గ్రామాలను కైవసం చేసుకుంటే తెలుగుదేశం అతి తక్కువగా 71 స్థానాలకే పరిమితం అయింది. ముఖ్య మంత్రి ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో కూడా టీడీపీ గెలవలేకపోవడం, 108 పంచాయతీలను అన్నింటినీ వైసీపీ గెలుచుకోవడం ఒక రికార్డుగా కనిపిస్తుంది. అలాగే చిత్తూరు జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పుంగనూరు నియో జకవర్గంలోనూ వంద శాతం వైసీపీ అభ్యర్థులే సర్పంచ్ పదవులను గెలుచుకున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1,161 పంచాయతీలను గెలుచుకుంటే, 188 పంచాయతీలకే టీడీపీ పరిమితం అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి పునరావృతం అయ్యాయని అనుకోవాలి. గ్రామాలలో ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన పలు పథకాలు బాగా పనిచేశాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలతో పాటు సోషల్ ఇంజినీరింగ్ కూడా జగన్ సమర్థంగా చేయగలిగారనీ, మిగిలిన వర్గాలతో పాటు బీసీలను కూడా బాగా ఆకట్టుకోవడం వల్లే కుప్పంతో సహా అన్ని నియోజకవర్గాలలో విజయం సాధ్యమైందనీ చెబుతున్నారు. ఈ గెలుపు ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగింది. పల్లె ప్రజలు వైసీపీ పట్ల, ముఖ్యమంత్రి జగన్ పట్ల అచంచల విశ్వాసాన్ని కనబరిచారు. ఇదే సోషల్ ఇంజినీరింగ్‌ను జగన్ కొనసాగించగలిగితే భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలలో గానీ, మండల, జడ్పీ ఎన్నికలలో గానీ, తదుపరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సైతం తిరుగు ఉండదన్న భావన కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ వైఫల్యం చెందిందో గుర్తించలేక, అధికార దుర్వినియోగమనీ, అరాచకమనీ ఏవేవో ఆరోపణలు చేయడానికి చంద్రబాబు తంటాలు పడుతున్నారు. అవి ఏ మాత్రం నిజం కాదని చెప్పడానికి ఎన్నికల కమి షనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలు ఉదాహరణ అవుతాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తి సజావుగా జరిగాయని ఆయన ప్రకటిం చారు. ఇది చంద్రబాబుకు నచ్చడం లేదు. మొన్నటి దాకా ఎన్నికల కమిషనర్‌ను ఆకాశానికి ఎత్తేసిన చంద్రబాబు ఇప్పుడు ఆయన్ని కింద పడేసి, ఎన్నికల కమిషన్ వైఫల్యం అని ప్రచారం చేస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు ఈ విషయంలోనూ అలాగే చేశారని అనుకోవచ్చు. సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కరోనా వైరస్ నిరోధానికి టీకాలు ఇవ్వాలనీ, ఎన్నికలు వాయిదా వేద్దామనీ ప్రతిపాదిస్తే, ఎన్ని కల కమిషన్ గానీ, తెలుగుదేశం పార్టీ గానీ ససేమిరా అన్నాయి. తీరా ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలా మారింది. దీన్నే పడుకున్న ఎద్దును లేపి తన్నించుకోవడం అంటారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అర్థవంతంగా ఉందని అనుకోవాలా? కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
టీడీపీ నేతల వీరంగం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో టీడీపీ నేతలు కత్తులతో వీరంగం సృష్టించారు. వైస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాల మీద కత్తులతో దాడులు చేశారు. ఈ ఘటన కేవీ పల్లి మండలం తిమ్మాపురంలో జరిగింది. టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన 10 మంది గాయపడ్డారు. దారుణం ఏంటంటే వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వివరాలు.. పంచాయితీ ఎన్నికల్లో తిమ్మాపురంలో టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలిచాడు. దాంతో బరితెగించిన తెలుగుదేశం నేతలు వైఎస్సార్సీపీ శ్రేణుల కుటుంబాలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ద్వారక, ఆనంద్‌లతో పాటు మరో 50 మంది ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముద్దుకృష్ణ ఇంటితోపాటు మరో నాలుగు కుటుంబాల మీద దాడులు చేశారు. కత్తులు, ఇనప రాడ్లతో దాడులు చేయడంతో 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం వీరందరిని పీలేరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు! -
టీడీపీ నేతల వీరంగం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి
-
‘ఆ విషయం కూడా తెలియని వ్యక్తి మన ఎస్ఈసీ’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగీ రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమర్థతలేని వ్యక్తిని స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్ఈసీ)గా చంద్రబాబు హయాంలో నియమించారన్నారు. ఓటు ఎలా బదిలీ చేసుకోవాలనే ప్రాథమిక విషయం కూడా తెలియని వ్యక్తి మన ఎన్నికల కమిషనర్ అని ధ్వజమెత్తారు. 6 నెలలు పాటు అక్కడ నివాసం ఉంటేనే ఓటు ఎక్కుతుందని తెలియని అసమర్థ వ్యక్తి సీట్లో కూర్చొని చట్టాలు అమలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ఏకగ్రీవం అనేది గ్రామంలోని ప్రజలే చేసుకుంటారని, దీనిని ఎస్ఈసీ ఎందుకు నిలిపివేయాలని చూస్తోందన్నారు. రాష్ట్రపతి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలే ఏకగ్రీవం అవుతుంటే.. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు వద్దని చెప్పడానికి ఎస్ఈసీ ఎవరని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో 90 శాతం పైగా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని, నామినేషన్ వేస్తుంటే అడ్డుకున్నారని ఎవరైనా పిర్యాదు చేశారా అన్నారు. అలా లేనప్పుడు ఏకగ్రీవాలన్నీ సక్రమమే అని జోగీ రమేష్ పేర్కొన్నారు. ఒకవేళ ఏకగ్రీవాలు వద్దని చంద్రబాబు హైకోర్టుకు వెళ్లగలరా అని సవాలు విసిరారు. బరితెగించి వ్యవస్థలను నాశనం చేయడానికి వీరు కంకణం కట్టుకున్నారని, అధికారాలను కాలరాయడానికి ఎస్ఈసీ ఎవరని మండిపడ్డారు. శిఖండిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు నడిపిస్తున్నారని, ఏకగ్రీవాలనేవి 30 ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమమని చెప్పారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోమంటే.. మేనిఫెస్టోను రద్దు చేశారని, మేనిఫెస్టో విడుదల చేసినందుకు బాబుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారం ఉందని ఎస్ఈసీ అధికారులను బెదిరిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులకు అనుగుణంగా ఎస్ఈసీ తన ప్రవర్తనను మార్చుకోవాలని, చంద్రబాబుకు తొత్తులా ఉండటం ఎస్ఈసీ మానుకోవాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. -
జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం
సాక్షి, గుంటూరు : పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పలు పంచాయతీల్లో ఏకగ్రీవాలకే ఓటు వేశారు. రికార్డు స్థాయిలో 67 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి దశలో తెనాలి డివిజన్లో 337 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా 20 శాతం పంచాయతీలు పోటీ లేకుండా అభ్యర్థుల గెలుపొందారు. పల్లెల్లో అభివృద్ధి, ప్రశాంతతకు ప్రజలు ఓటు వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా పెంచడం, పార్టీలకు అతీతంగా ఏకగ్రీవాలను వైఎస్సార్ సీపీ ప్రోత్సహించడంతో ఈ దఫా ఏకగ్రీవాలు భారీస్థాయిలో జరిగాయి. 2013లో జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 15 శాతమే ఏకగ్రీవాలు జరిగాయి. టీడీపీ పంతం కోసం బలవంతంగా అభ్యర్థులను బరిలోకి దించకపోతే మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యేవని రాజకీయ విశ్లేష కులు పేర్కొంటున్నారు. టీడీపీ ఉనికిని కాపాడుకోవడం కోసం పచ్చపల్లెల్లో చిచ్చురేపుతోందని ప్రజలు మండిపడుతున్నారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న తెనాలి డివిజన్లో నియోజకవర్గాల వారీగా రేపల్లెలో 17, ప్రత్తిపాడులో ఆరు, వేమూరులో 12, బాపట్లలో 15, పొన్నూరులో 10, తెనాలిలో ఏడు పంచాయతీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. 17 మేజర్ పంచాయతీలు ఏకగ్రీవం వైపు పయనించడం అభినందనీయం. 270 పంచాయతీలలో పోలింగ్... తెనాలి డివిజన్ పరిధిలో 337 పంచాయతీలకు జనవరి 31న గడువు ముగిసే సమయానికి 1,757 మంది నాటికి నామినేషన్లు సమరి్పంచారు. పరిశీ లన తర్వాత 96 నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో 1,661 మిగిలాయి. 3,442 వార్డు స్థానాలకు 8,048 నామినేషన్లు దాఖలు చేయగా, 176 తిరస్కరణకు గురవ్వగా 7,872 నామినేషన్లు మిగిలాయి. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత 270 పంచాయతీల్లో ఈ నెల 9న పోలింగ్ జరగనుంది. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను తెలుగు అక్షరమాల క్రమంలో రిటరి్నంగ్ అధికారులు ప్రకటించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తును వరుస క్రమంలో ప్రకటించారు. వాటిని అక్షర క్రమంలో మొదటి వ్యక్తికి మొదటి గుర్తు, రెండో వ్యక్తికి రెండో గుర్తు ... ఇలా ఎంతమంది పోటీలో ఉంటే అన్ని గుర్తులను కేటాయించారు. జోరందుకున్న ప్రచారం పంచాయతీ పోరు తుది దశకు చేరడంతో ప్రచారం జోరందుకుంది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా, వారి గుర్తులను ఎన్నికల అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు తమ గుర్తులను ఓటర్లకు చేరేలా ప్రచురణ పత్రాలు, ఫ్లెక్సీలు సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలి్చతే ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను ప్రత్యక్షంగా కలసి అభ్యర్థించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ప్రచారం కూడా బాగా పెరిగింది. -
టీడీపీపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, కర్నూలు: అధికార పార్టీపై నానా యాగీ చేస్తున్న విపక్ష నేతలు.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల సమరంపై కర్నూలు పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని తెలిసిన టీడీపీ నేతలు రోజుకో పంచాయతీని తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. నందికొట్కూర్ వైఎస్సార్సీపీ విభేదాలపై స్పందించిన మంత్రి .. పంచాయతీ ఎన్నికల్లో టికెట్ల కోసం వైఎస్సార్సీపీ నేతల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు సహజమేనని పేర్కొన్నారు. ఇది తమ అంతర్గత వ్యవహారమని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షానికి లబ్ధి చేకూరే ఎలాంటి పొరపాట్లకు ఆస్కారమివ్వమని స్పష్టం చేశారు. ఎంపీటీసీలు ఏకగ్రీవమైన ప్రాంతాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది దారుణమని, అసంబద్ధమని పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థి చనిపోతే ఎన్నికల కమిషనర్ సంఘటన స్థలానికి వెళ్లడం అనేది మొదటిసారిగా చూస్తున్నానన్నారు. టీడీపీ నేతల తీరు చూస్తుంటే సునీల్ గవాస్కర్ ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు పరిస్థితి గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. -
ఎస్ఈసీ నిమ్మాడకు ఎందుకు వెళ్లలేదు..?: సజ్జల
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. టీడీపీ దౌర్జన్యకారుల ధాటికి అట్టుడుకుతున్న నిమ్మాడ గ్రామానికి ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే.. నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడన్న విషయం మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రలోభాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చట్టంలో మౌలిక మార్పులు తెచ్చామని వివరించారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, నిమ్మాడ ఘటనే ఇందుకు ఉదాహరణ అని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇలాఖా అయిన నిమ్మాడలో ఇంతవరకు స్వేచ్ఛగా నామినేషన్ వేసిన దాఖలాలు లేవని, గతంలో టీడీపీ నేతలను వ్యతిరేకించిన 8 మంది హత్యకు గురయ్యారని గర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అచ్చెన్నాయుడు అతని అనుచరగణం వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన అప్పన్న నామినేషన్ వేయకుండా దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. గతంలో నిమ్మాడలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేశారని గర్తు చేశారు. చంద్రబాబు చెప్పే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని సజ్జల నిలదీశారు. విజయవాడ దాడి ఘటనలో టీడీపీ పాత్ర ఉన్నట్టు అనుమానాన్ని వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను పక్కదారి పట్టించేందుకే టీడీపీ నేతలు ఈ డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. బస్సులు తగలబెట్టడం చంద్రబాబు నైజం అని దగ్గుబాటి పుస్తకంలో ప్రస్తావించిన అంశాన్ని సజ్జల ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నేతలు డబ్బులిచ్చి రాజమండ్రిలో విగ్రహ ధ్వంసం చేయించారని, అంబేడ్కర్, రంగా విగ్రహాల ధ్వంసానికి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారన్నారు. ఎస్ఈసీ యాప్‌పై అనేక అనుమానాలున్నాయని, దానికి బదులు సీఈసీ యాప్‌ను వాడాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఏకగ్రీవాలపై కుట్ర జరుగుతోంది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ఎస్ఈసీ ఆధ్వర్యంలో కుట్రలు జరుగుతన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలు జరిగితే లభించే ప్రోత్సాహకాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న సదుద్దేశంతో ప్రభుత్వం ఏకగ్రీవాలపై ప్రకటన చేస్తే, దానికి దురుద్ధేవాలను ఆపాదిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఏకగ్రీవాలను అడ్డుకొని గ్రామాల్లో ప్రశాంతతకు భగ్నం కలిగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో అధికార పార్టీకి నష్టం కలిగించి, ఇతర పార్టీలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎస్ఈసీ పని చేస్తున్నారని, అందులో భాగంగా టీడీపీకి మేలు చేకూర్చేలా సొంత యాప్‌ను కూడా రూపొందించారన్నారు. ఎస్ఈసీ దుందుడుకు చర్యలను ప్రశ్నించిన ప్రభుత్వ సలహాదారును తొలగించమనటం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహాదారుగా పాలసీలపై మట్లాడే హక్కు సజ్జల రాయకృష్ణారెడ్డికి ఉందని, అసలు ఆయన చేసిని వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. సజ్జలపై ఎస్ఈసీ చేసిన విమర్శలు రాజకీయ విమర్శల్లా ఉన్నాయని, రాజ్యాంగం ముసుగులో నిమ్మగడ్డ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కోసం ఏకగ్రీవాలు చేసుకోవాలని మంత్రులు పిలుపునిస్తే తప్ప పట్టడంలో అర్ధం ఏంటని ప్రశ్నించారు. పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటిస్తే చర్యలు తీసుకోని ఎస్ఈసీ.. అధికారులపై తన పరిధి దాటి చర్యలకు పూనుకోవడం ఏంటని నిలదీశారు. ఎస్ఈసీ చేపడుతున్న చర్యలు రాజ్యాంగ చర్యల్లా లేవని, రాజకీయ చర్యల్లా ఉన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. -
టీడీపీ మేనిఫెస్టోపై చర్యలేవి..?
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడరమేశ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ, ఎన్నికల కమీషనర్లా కాకుండా చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి, మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారంటూ మండి పడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ తీరు ఒంటెద్దు పోకడలా ఉందంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసినా స్పందించని నిమ్మగడ్డ.. ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. ఉన్నత పదవిలో ఉంటూ ఆయన ఇలా వ్యవహరించడం సరికాదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల ఫలితాలు ఆయను గుణపాఠం నేర్పుతాయని మంత్రి హెచ్చరించారు. నిమ్మగడ్డ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంటే, ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న నిమ్మగడ్డ తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నాడని మంత్రి తానేటి వనిత కామెంట్ చేశారు. ప్రభుత్వం పట్ల నిమ్మగడ్డ కక్షపూరిత ధోరణి సరికాదని ఆమె మండి పడ్డారు. ఎన్నికల కమిషనర్‌కు ఎన్నికలు సజావుగా నిర్వహించే హక్కు ఉంటుందని, ఆ హక్కును ఉపయోగించి ఎన్నికలు సజావుగా జరిగేటట్టు చూడాలే కానీ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని హితవు పలికారు. ఎస్ఈసీ స్థాయికి మించి జోక్యం చేసుకుంటున్నారు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తున్నాడని, ఉన్నతాధికారుల విషయంలో తన స్థాయికి మించి ఆయన జ్యోక్యం చేసుకొంటున్నాడని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేశ్ గౌడ్ ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి ఎన్నికల కమీషనర్ లేడని, గతంలో పని చేసిన ఎస్ఈసీలను చూసైనా ఆయన హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి ఆయన సూచించారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా.. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలు బొమ్మ అని, నిమ్మగడ్డను చంద్రబాబు అడిస్తున్నాడని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఫైరయ్యారు. మంత్రులపై ఫిర్యాదు చేస్తూ గవర్నర్‌కు రాసిన లేఖ నిమ్మగడ్డ రాసింది కాదని, చంద్రబాబు రాసిన లేఖనే ఆయన యధాతధంగా గవర్నర్‌కు పంపాడని ఆరోపించారు. మంత్రులు, వైసీపీ నేతలపై బురద చల్లేందుకే నిమ్మగడ్డ ఇలా వ్యవహరిస్తున్నాడని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఎమ్మెల్యే విమర్శించారు. రాజ్యాంగ బద్దంగా పనిచేయడం లేదు.. ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్యాంగ బద్దంగా పనిచేయడం లేదని, ఆయన వ్యవహరిస్తున్న తీరు టీడీపీకి గులాంగిరి చేసినట్లుందని వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో వైషమ్యాలను సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్‌కు అనుగుణంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఏకగ్రీవాలనేవి ఎప్పటినుంచో ఉన్నాయని, అది కూడా తెలుసుకోకుండా మాట్లాడటం నిమ్మగడ్డ స్థాయికి సరికాదన్నారు. -
నియంతలా వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండి పడ్డారు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన వ్యక్తి.. నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీనియర్ అధికారుల పట్ల ఆయన పరిధి దాటి చర్యలకు ఆదేశిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి వ్యక్తిగత అభిప్రాయాలు తగవని గుర్తు చేశారు. అసలు నిమ్మగడ్డ ఐఏఎస్ ఎలా అయ్యారో తెలీడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిమ్మగడ్డ నియంత్రణను కోల్పోయి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ద్వివేదిని చంద్రబాబు బెదిరించారని, అలా చేసినా.. గోపాలకృష్ణ ద్వివేది హుందాగా వ్యవహరించిన విషయాన్ని సజ్జల గర్తు చేశారు. టీఎన్ శేషన్ లాంటి వ్యక్తులు కూడా పరిధికి లోబడి వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఏజెంట్లా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. గతంలో ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారో కారణాలు చూపడం లేదని విమర్శించారు. ఎన్నికల విధుల నుంచి అధికారులనందరిని తప్పించి టీడీపీ గూండాలు, చంద్రబాబు ఏజెంట్లతో ఎన్నికలు నిర్వహిస్తారా అని నిమ్మగడ్డను నిలదీశారు. గతంలో ఏకగ్రీవాలపై నోరు మెదపని నిమ్మగడ్డ.. ఇప్పుడు అనవసర ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 2018లో ఆయన పంచాయతీ ఎన్నికలు ఎందుకు జరపలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్న నిమ్మగడ్డ.. సీఎం, డీజీపీ, ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు ఇతర ఉద్యోగులపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై నమ్మకం లేని ఎస్ఈసీ.. ప్రభుత్వ యంత్రాంగం లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహించగలరని ప్రశ్నించారు. అసలు నిమ్మగడ్డ ఎన్నికలు జరుపుతున్న విధానమే సరైనది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
ఆదాయం ఇక్కడ.. అభివృద్ధి అక్కడ
సాక్షి, అల్లాదుర్గం(మెదక్): గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. కొత్త పంచాయతీలు ఏర్పడి రెండేళ్లు కావస్తున్న రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణాలకు పాత పంచాయతీల సర్పంచ్‌లే అనుమతులు ఇవ్వడం, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్లో కొత్త పంచాయతీలు కనిపించడం లేదు. కొత్త పంచాయతీలకు వచ్చే ఆదాయం విడిపోయిన పాత పంచాయతీలకే అందుతుండటంతో కొత్త పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లు ఎమిచేయలేని పరిస్థితితో కొట్టుమిట్టాడుతున్నారు. మెదక్ జిల్లాలో 2018 ఆగస్టులో 150 గ్రామ పంచాయతీలు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 జనవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. పాలక వర్గాలు ఏర్పడ్డాయి. అల్లాదుర్గం మండలంలో గొల్లకుంట తండా, నడిమితండా, సీతానగర్ గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటయ్యయి. కొత్త పంచాయతీలు ఏర్పడి రెండేళ్లు గడిచినా ఆన్లైన్లో వివిధ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే గ్రామ పంచాయతీలు పేర్లు రావడం లేదు. గ్రామాలలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర పనుల కోసం ఉపయోగించుకునేందుకు గ్రామ పంచాయతీలు ఎన్ఓసీ (నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇవ్వాలి. ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టాలన్న పంచాయతీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులకు సంబంధించి రుసుము పంచాయతీలకు చెల్లించాల్సి ఉంటుంది. వీటి అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కోసం లబ్ధిదారులు ఆన్లైన్లో చేస్తే కొత్త పంచాయతీలకు సంబంధించి ఎలాంటి వివరాలు చూపించడం లేదు. పాత పంచాయతీల పేరుపై ఉండటంతో కొత్త పంచాయతీలకు ఆదాయం జమకావడంలేదు. ఇక పాత పంచాయతీల సర్పంచ్‌లే అనుమతులు ఇస్తుండటంతో ఆ పంచాయతీల ఖాతాలకే ఆదాయం జమవుతుంది. ఇలా కొత్త పంచాయతీలు ఆదాయాన్ని కల్పోతున్నాయి. జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి కొత్తవాటికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. వివరాలన్నీ ఆన్లైన్ చేయాలి కొత్త పంచాయతీల సర్వే నంబర్లు, పంచాయతీల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయాలి. మీ సేవా కేంద్రాల్లో సంబంధిత పనుల కోసం దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ పేర్లు ఆన్లైన్లో రావడం లేదు. పాత పంచాయతీల మధిర గ్రామాలుగానే చూపిస్తుంది. ఇలా పాతవాటినే చూపుతుంటంతో పంచాయతీలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించాలి. – సోని రాథోడ్, సర్పంచ్, గొల్లకుంటతండా ఆదాయమే లేదు కొత్త పంచాయతీలకు ఆదాయమే లేదు. ఆన్లైన్ కాకపోవడం, రికార్డులు లేకపోవడం, పంచాయతీ పరిధిలో రిజిష్ట్రేషన్లు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న కొత్త పంచాయతీల ఆనుమతులు తీసుకోవడం లేదు. పాత పంచాయతీల సర్పంచ్ల నుంచి తీసుకుంటుడటంతో మా పంచాయతీ పరిధిలో ఏమి జరుగుతుందో తెలియడం లేదు. సర్పంచ్, కార్యదర్శిని ఎవరూ సంప్రదించడం లేదు. అధికారులు కొత్త పంచాయతీలకు ఆదాయం వచ్చే చర్యలు తీసుకోవాలి. – రంజిత్ నాయక్, సర్పంచ్, నడిమితండా కొత్త పంచాయతీలను ఆన్లైన్ చేయిస్తా జిల్లాలో 150 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంచాయతీలకు సంబందించిన హద్దులు, సర్వే నంబర్లు సేకరించాం. వీటిని ఆన్లైన్ చేయిస్తాం. ఈ సర్వే నంబర్లలో రిజిష్ట్రేషన్ కార్యాలయం ద్వారా క్రయవిక్రయాలు జరిపితే సంబందిత పంచాయతీలకు కొంత పర్సంటేజి ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో మాట్లాడి కొత్త పంచాయతీలకే ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – హనూక్, డీపీఓ -
ఏపీలో స్ధానిక సమరం!
-
ఉగాది లోపే ‘స్థానిక’ సమరం!
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు సానుకూలంగా వెలువడే పక్షంలో ఉగాది లోపే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక దశకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఓటింగ్, లెక్కింపు అన్నీ పండుగ లోపే పూర్తి చేయటంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ దీనిపై చర్చించేందుకు శుక్రవారం పోలీసు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యదర్శి ఎస్.రామసుందర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఆగిన నిధులు రూ.5,000 కోట్లకుపైనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనందువల్ల 2018 ఆగస్టు తర్వాత రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల నిలిచిపోయిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు రూ.3,710 కోట్లు ఆగిపోగా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు రూ.1,400 కోట్లు దాకా నిధులు నిలిచిపోయాయి. మార్చి నెలాఖరుతో 14వ ఆర్థిక సంఘం ఐదేళ్ల గడువు ముగుస్తున్నందువల్ల ఆ నిధులను కేంద్రం నుంచి తెచ్చేందుకు వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఐదారు నెలలుగా అన్ని చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ గతంలోనే ప్రకటించారు. నేడు లేదా సోమవారం తీర్పు వెలువడే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారంపై టీడీపీ సానుభూతిపరులు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. హైకోర్టు తన తీర్పును శనివారం లేదంటే సోమవారం వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీర్పు అనుకూలతను బట్టి మార్చి నెలాఖరులోగా ఎన్నికలు జరిపి కేంద్రం నుంచి నిధులు తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉగాదిలోపే ఒక దశ ఎన్నికల ప్రక్రియ ముగించేలా కసరత్తు చేస్తోంది. పరీక్షల మధ్య సెలవు తేదీల్లో.. ఇంటర్, పదో తరగతి పరీక్షలు మార్చిలో మొదలై ఏప్రిల్ మధ్య వరకు జరగనున్నాయి. విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలకు మధ్య ఎక్కువ సెలవులు ఉన్న తేదీల్లో పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. అందుకనుగుణంగా పోలీసు భద్రత కల్పించడంపై శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించారు. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలు తెప్పించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ సూచించారు. దీనిపై రెండు రోజుల్లో పోలీసు శాఖ తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందజేస్తామని శాంతిభద్రతల విభాగపు అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఒకవేళ రిజర్వేషన్ల శాతాన్ని తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన పక్షంలో అందుకనుగుణంగా ఇప్పటికే ఖరారు చేసిన రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు ఎంత వేగంగా చేయగలరనే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
మహిళలే... మహరాణులు
సాక్షి, తూర్పు గోదావరి : ప్రతీ ఓటు కీలకంగా భావించే పంచాయతీ పోరులో మహిళలు ప్రధాన భూమిక పోషించనున్నారు. అధికంగా ఓటుహక్కు కలిగి ఉండటం ద్వారా అభ్యర్థి జయాపజయాలను ప్రభావితం చేయనున్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లలో అధికంగా మహిళలు 14,102 మంది ఓటుహక్కును కలిగి ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో వీరిదే పైచేయి. 50 శాతం పంచాయతీల్లో అతివలే అందలమెక్కనున్నారు. త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందన్న ఊహాగానాలు నేపథ్యంలో రిజర్వేషన్లపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జిల్లాలో 1,072 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కుల,గణన పూర్తి చేసి ఓటరు జాబితాలను సిద్ధం చేసింది. జిల్లాలోని పంచాయతీల్లో మొత్తం 32,52,069 మంది ఓటర్లుండగా పురుషులు 16,18,930 మంది, మహిళలు 16,33,032 మంది, ఇతరులు 107 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే 14,102 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో వీరి ఓట్లు అధికంగా ఉన్నాయి. పంచాయతీ పోరులో ప్రతి ఓటూ ముఖ్యమైనదే...దీంతో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములను వీరు ప్రభావితం చేయనున్నారు. 50 శాతం పంచాయతీల్లో మహిళలు అందలమెక్కనున్నారు. 12,514కు పెరిగిన పోలింగ్ కేంద్రాలు సాధారణంగా వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేవారు. ఈ మేరకు గత పంచాయతీ ఎన్నికల్లో 1,007 పంచాయతీల్లో ఎన్నికల కోసం 11,434 పొలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 1072 పంచాయతీల్లో ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేశారు. తాజా నిబంధనల మేరకు వార్డులో 650 ఓట్లు దాటితే మరొక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అలాగే వార్డులో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు మూడో వంతు ఉన్నా, పంచాయతీకి దూరంగా రెండు నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న వాటికి అదనంగా మరొక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో 11994 వార్డులకుగాను అధికారులు 12,514 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రిజర్వేషన్లపై జోరుగా చర్చలు సుప్రీంకోర్టు సూచనమేరకు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రభుత్వ నిర్ణయం మేరకు పంచాయతీ, వార్డుల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులు కసరత్తు చేయనున్నారు. ఓసీ జనరల్, ఓసీ లేడీ, బీసీ జనరల్, బీసీ లేడీ, ఎస్సీ జనరల్, ఎస్సీ లేడీ, ఎస్టీ జనరల్, ఎస్టీ లేడీ కేటగిరీలుగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గతంలో పంచాయతీ, వాటిలోని ఆయా వార్డులు ఏ సామాజిక వర్గాలకు రిజర్వయ్యాయి, ఇప్పుడు ఏ సామాజిక వర్గాలకు రిజర్వవుతాయనే విషయమై గ్రామాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటి నుంచే ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావాహులు గ్రామాల్లో పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ వారితో లోపాయికారీ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. -
టీడీపీ: పోటీ చేద్దామా..? వద్దా..!
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నారు. ప్రజాభిమానం పొందుతున్నారు. అదే ఉత్సాహంతో స్థానిక పోరుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు కదులుతున్నాయి. మరోవైపు టీడీపీ నాయకులు బీజేపీలో కలిసిపోతుండడం.. రాష్ట్రంలో అసలు పార్టీ ఉంటుందో లేదోనన్న బెంగతో పార్టీ శ్రేణులు చెల్లాచెదురవుతున్నాయి. స్థానిక పోరులో పోటీకి వెనుకంజవేస్తున్నాయి. అసలు బరిలో నిలవాలా వద్దా అన్న సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాస్తవంగా గతేడాది ఆగస్టులో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మొగ్గుచూపకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అవి అయిపోగానే వెంటనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తుండడంతో తగిన విధంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. విజయనగరం జిల్లాలోని 34 మండలాల్లో 919 గ్రామ పంచాయతీలు ఉండగా... మొత్తం 14,80,099 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 7,33,372 మంది కాగా... మహిళా ఓటర్లు 7,46,671 మంది ఉన్నారు. ఇతరులు మరో 56 మంది వరకు ఉన్నట్లు అధికారిక వర్గాలు లెక్కతేల్చాయి. ఈ ఓటర్లు పంచాయతీలకు సర్పంచ్‌లను ఎన్నుకోవడంతోపాటు ఆయా గ్రామాల్లోని వార్డు సభ్యులను ఎన్నుకోవాల్సిఉంది. వైఎస్సార్సీపీ జోష్.. టీడీపీ డీలా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేసి క్లీన్ స్వీప్ చేయటంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓటర్లు భారీ మెజారిటీని అందించారు. టీడీపీకి పట్టున్న గ్రామాల్లో సైతం వైఎస్సార్సీపీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. దీంతో అధికారపార్టీ వైఎస్సార్సీపీ కేడర్ ఫుల్ జోష్‌లో ఉంది. టీడీపీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన వ్యక్తి ప్రజల్లో కనిపించడం లేదు. ఘోర పరాజయంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు. చాలా గ్రామాల్లో టీడీపీ నేతలు చెల్లాచెదురయ్యారు. దీనికితోడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పార్టీ అధినాయకుడు చంద్రబాబు పోలింగ్ తరువాత గట్టి ధీమా వ్యక్తం చేయడంతో ఆయన మాటలు నమ్మి అనేక మంది నేతలు, కార్యకర్తలు బెట్టింగ్‌లకు దిగి తీవ్రంగా నష్టపోయారు. అంతేగాక ఎన్నికల్లో అధిక మొత్తంలో ఖర్చు పెట్టిన అంచనాలకు అందని పరాజయం కూడా అభ్యర్థులను కుంగదీసింది. పంచాయతీ ఖర్చుపై చర్చ జిల్లాలో ఎన్నికలు ఆర్థికంగా భారంగా మారాయి. ఒక్కో ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.3వేలు వెచ్చించి పార్టీలు ఓట్లు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఓటర్లు ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఎవరికైనా సరే తమకు ఎంత ఇస్తారనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటరుకు రూ.1000 నుంచి రూ.3 వేల వరకు పంచాల్సి వస్తుందేమోనని నేతలు దీర్ఘాలోచనలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ఆర్థికంగా మోయలేని భారంగా ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసినా.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మాదిరి ఓటమి పాలైతే అప్పులు తప్ప మిగిలేదీ ఏమి ఉండదన్న భావన టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. ఇప్పటికిప్పుడు రూ.లక్షల్లో ఖర్చు చేసి ఎన్నికల్లో నిలబడేందుకు టీడీపీ కేడర్ సిద్ధంగా లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఆర్థిక సాయం అందిస్తే ఆలోచిస్తాం.. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా పంచాయతీల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు నగదు సాయం చేస్తేనే పంచాయతీ ఎన్నికల్లో నిలబడాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో ఓటర్లు ఎంతవరకు తమ పార్టీకి సహకరిస్తారనే సంశయం కూడా ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వదిలేస్తే పార్టీ కేడర్ మరింత దెబ్బతింటుందనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వదిలేయాలా అనే సందిగ్ధంలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారే తరువాయి...! స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేశారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో 65.94 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఇందులో బీసీలకు 39.39 శాతం, ఎస్సీలకు 18.30, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని 50శాతానికి లోబడి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉన్నందున 15.94 శాతం తగ్గించాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మరో వైపు గత ఐదు విడతల పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు రొటేషన్ విధానంలో కేటాయించారు. దీంతో ఈసారి రొటేషన్‌కు భిన్నంగా గత రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోకుండా ఖరారు చేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో స్పష్టత రానుండగా.. వీలైనంత తర్వగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, ఆపై మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, అనంతరం పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నాయి. గ్రీన్‌సిగ్నల్ వస్తే రెండు దశల్లో ఎన్నికలు కులగణన పూర్తిచేసిన అనంతరం ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఎన్నికల సంఘం రంగంలోకి దిగుతుంది. దీనికి అనుగుణంగా మండలం లేదా రెవెన్యూ డివిజన్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని సిద్ధం చేసే అవకాశం ఉంది. జిల్లా పంచాయతీ అధికారులు జిల్లాలో రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ పరిశీలనకు పంపారు. మొదటిగా విజయనగరం రెవెన్యూ డివిజన్లోని 19 మండలాల గ్రామ పంచాయతీలకు, అనంతరం పార్వతీపురం రెవెన్యూ డివిజన్లోని 15 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరిగేందుకు హెచ్చు అవకాశాలు ఉన్నాయి. -
పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మంగళవారం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను ప్రభుత్వం 34 శాతం నుంచి 22శాతానికి తగ్గించిందని, ఈ నేపథ్యంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల మూడో తేదీన (గురువారం) తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ అంశంపై కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. -
మరో రంగస్థలం
జిల్లాలోని కుల్లూరు పంచాయతీలో ప్రస్తుతం రంగస్థలం కథ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలు రాక ముందే అక్కడ వాతావరణం వేడెక్కింది. పంచాయతీలో ఓ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్లు అధికారులు, ప్రజలు వినాల్సిందే. వినకపోతే వారిపై అవినీతి, అక్రమాల పేరుతో అధికారుల చేత విచారణలు, వేదింపులకు గురి చేస్తున్నాడు. తప్పు చేయకపోయినా.. చేసినట్లు ఆధారాలు లేకపోయినా.. ఏదో ఒక విధంగా చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నాడు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రజాప్రతినిధి చెప్పినట్లు చేయడం లేదనే అక్కసుతో అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆకాశారామన్న ఫిర్యాదులు తీసుకెళ్లి జిల్లా అధికారులకు అందజేసి విచారణ పేరుతో వేదిస్తున్నారు. అధికారులు కూడా ఆకాశ రామన్న ఫిర్యాదులకు అత్యంత ప్రధాన్యం ఇచ్చి కింది స్థాయి అధికారులతో విచారణలు చేయిస్తున్నారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లేదని నివేదికలు అందజేస్తే మరొక ఆకాశ రామన్న ఫిర్యాదు చేసి విచారించి చర్యలు తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు(పొగతోట): జిల్లాలోని కలువాయి మండలంలో ఉన్న కుల్లూరు మేజర్ పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి పి.వంశీకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్(ఎఫ్ఏ)గా పని చేస్తూ కూలీలకు పనులు కల్పిస్తున్నాడు. ఉపాధి హామీ పనులు కల్పించడంలో ఈ పంచాయతీ ప్రథమ స్థానంలో ఉండడంతో ఎఫ్ఏ వంశీకృష్ణ ఎంపీడీఓ చేతులమీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఉ పాధి కూలీలకు రోజుకు రూ.200లకు పైగా వేత నం మంజూరయ్యేలా పనులు చూపిస్తున్నాడు. ఎఫ్ఏ తాను చెప్పినట్లుగా నడుచుకోలేదని ప్రజా ప్రతినిధి ఆకాశ రామన్న ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. ఇద్దరు, ముగ్గురు కూలీలను రెచ్చగొట్టి ఎఫ్‌ఏపై ఫిర్యాదులు చేయించాడు. కొద్ది రోజుల తరువాత ఫిర్యాదులు చేసిన కూలీలు ఎంపీడీఓ వద్దకు వచ్చి తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ఎఫ్ఏ తమకు పనులు కల్పిస్తున్నాడని, అతను అక్రమాలకు పాల్పడడం లేదని తెలిపారు.\ తమకు రావాల్సిన వేతనాలు అతను తీసుకోవడం లేదని ఎంపీడీఓకు రాతపూర్వకంగా వివరించారు. అనంతరం ఆ ప్రజాప్రతినిధి కూలీలు కాకుండా పంచాయతీ పాలక సభ్యులతో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆగమేఘాలపై కుల్లూరులో ఈ నెల 18వ తేదీన విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. గతంలో ఆధారులు లేని ఫిర్యాదుకు సంబంధించి బ్యాంక్ కార్సండెంట్ నుంచి కూలీలకు ఇవ్వాల్సిన రూ.1.20 లక్షల నగదు ఎఫ్ఏ తీసుకున్నాడని అతనితో రాయించుకుని దీనిపై క్రిమినల్ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఉపాధి పనులు చేసినందుకు బ్యాంక్ కార్సండెంట్ కూలీలకు వేతనాలు ఇవ్వాల్సిఉంది. దానితో ఎఫ్‌ఏకు ఎలాంటి సంబంధం ఉండదు. చేసిన పనులకు వేతనాలు ఇంత వరకు ఇవ్వలేదని కూలీలు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఫిర్యాదులు చేయకుండా బ్యాంక్ కార్సండెంట్ నుంచి ఎఫ్ఏ నగదు తీసుకుపోయడంటే గుడ్డిగా ఏవిధంగా కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తే పై నుంచి ఏస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయో అర్థమవుతోంది. అవినీతిని కప్పిపెట్టి.. కుల్లూరు పంచాయతీలో రోడ్లు వేయకుండా రూ.లక్షల బిల్లులు స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి విచారణ చేయలేదు. పంటకుంటల బిల్లులు మంజూరు కాగానే వాటిని పూడ్చి వేసి పంటలు సాగు చేస్తున్నా వాటిపై ఎలాంటి విచారణ చేయడం లేదు. పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా చేశారని జిల్లా అధికారులకు నాలుగు పర్యయాలు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఉపాధి టీఏకు రూ.3.50 లక్షల రికవరీ పడితే దానిని రూ.14 వేలకు తగ్గించారు. దీనిపై ఇంత వరకు విచారణ చేయలేదు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయిన ఎఫ్‌ఏపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తుండడం గమనార్హం. -
'ముందస్తు’ సందడి
సాక్షి, వరంగల్ రూరల్: పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించే అవకాశముందని సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వేడి పుట్టింది. పంచాయతీరాజ్ చట్టంలో పలు మార్పులు తీసుకురావడంతోపాటు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, రిజర్వేషన్లను పదేళ్ల వరకు కొనసాగించాలని, సర్పంచ్ పదవికి పరోక్షంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 500 జనాభా ఉన్న ప్రతీ గ్రామం, తండాను గ్రామంపంచాయతీగా ఏర్పాటు చేయాలని ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. నూతన చట్టంపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం ఇటీవల సీఎంకు నివేదికను అందించగా సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి భూరికార్డుల శుద్ధీకరణ, ఈపాస్, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, పంచాయతీ ఎన్నికల గురించి చర్చించారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం బిల్లు అమోదం కోసం వచ్చే నెలలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. జూలైతో ముగింపు.. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలైతో ముగుస్తోంది. ఎన్నికల నియమావళి ప్రకారం మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే «అధికారం ఎన్నికల కమిషన్ ఉంది. జిల్లాలో 269 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నూతనంగా 500 మంది జనాబా ఉన్న ప్రతి గ్రామం, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయనుండటంతో మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ప్రజలతో మమేకం.. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు త్వరలో జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ఎన్నికల్లో బరిలో నిలవాలనుకునే ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. పల్లెల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా రాజకీయ నాయకులే ముందుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి, కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలచే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయిస్తున్నారు. నేతల చుట్టూ ప్రదక్షిణలు సర్పంచ్ పదవిని ఆశించే వారు ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటిస్తే బ్యానర్లు ఏర్పాటు చేస్తూ, ప్రజలను సమీకరిస్తూ జిల్లా నాయకుల దృష్టిలో పడటానికి పడరాని పాట్లు పడుతున్నారు. స్థానిక శాసన సభ్యుల పర్యటనలు ఎక్కువగా జరిగేలా ఒత్తిడి తీసుకువస్తున్నారు. -
వచ్చే నెలలోనే ‘పంచాయతీ’ ఎన్నికలు !
-
వచ్చే నెలలోనే సర్పంచ్ ఎన్నికలు.!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను వచ్చే నెల (ఫిబ్రవరి)లోనే నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. సర్పంచ్‌లను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలా, పరోక్షంగానా అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతోందని, ఆ ఎన్నికల విధి విధానాలను కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరుస్తామని తెలిపారు. ఈ మేరకు వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు వేల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తామని, మున్సిపల్ చట్టానికి సవరణలు చేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీపీవోలతో సమీక్ష నిర్వహించారు. రెండు విడతల్లో సుదీర్ఘంగా ఏడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పంచాయితీ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 500 జనాభా.. 1.5 కిలోమీటర్ల దూరం రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మరో నాలుగు వేలు కొత్త పంచాయతీలు ఏర్పాటు కావచ్చు. కనీసం 500 జనాభా, ఇప్పుడున్న గ్రామ పంచాయతీకి కనీసం ఒకటిన్నర రెండు కిలోమీటర్ల దూరం ఉండాలి. న్యాయపరమైన చిక్కులకు తావు లేకుండా కొత్త పంచాయితీలు ఏర్పాటు కావాలి. కలెక్టర్లు కొత్త పంచాయతీల భౌగోళిక సరిహద్దులు (పరిధి) నిర్ణయించి జనవరి 25 కల్లా ప్రభుత్వానికి పంపించాలి. పనిచేసే పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. పంచాయతీరాజ్ ఎంతో గొప్పగా రూపొందించబడిన మహత్తరమైన ఉద్యమం. ఇప్పుడు గ్రామాలు పెంట కుప్పలుగా ఉంటున్నాయి. అందుకే చర్చలు జరుపుతున్నాం. ప్రత్యక్ష ఎన్నికా? పరోక్ష ఎన్నికా? కూడా చర్చిస్తున్నాం. సర్పంచ్‌ను పనిచేసే సర్పంచ్‌గా చేయాలి, ఒకప్పుడు పంచాయతీల మీద జిల్లా కలెక్టరుకు ఎన్నో అధికారాలుండేవి. ఇప్పడు నియంత్రణ లేకుండా పోయింది. మున్సిపల్ చట్టానికి సవరణ చేసే ఆలోచనలు పరిశీలిస్తున్నాం. పంచాయతీ వ్యవస్థ ఎలా ఉండాలో కలెక్టర్లు తమ సలహాలు, సూచనలను పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి పంపాలి. సర్పంచ్‌లతో పని చేయించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు సూచనలు ఇవ్వాలి. వాటి ఆధారంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం బిల్లును ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో ప్రవేశపెడుతాం. గ్రామాల్లో వంద శాతం పన్ను వసూళ్లు రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేశాం. బడ్జెట్లో రూ.2,000 కోట్లు కేటాయిస్తాం. íమార్చి 12 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తాం. చిన్న గ్రామ పంచాయితీకి (500 వరకు జనాభా ఉన్నవి) రూ. 5 లక్షలు, తర్వాత స్థాయికి అనుగుణంగా రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలు ఇలా ప్రభుత్వం సమకూరుస్తుంది. గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలు చేయిస్తుంది. జాతీయ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగించుకుంటాం. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో ఆస్తులను సమకూర్చుకుంటాం. పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకుంటాం. ఎమ్మెల్యే, ఎంíపీల నిధుల నుంచి గ్రామాభివృద్ధికి వెచ్చిస్తాం. మనందరం పట్టుబడితే పరిశుభ్ర, అభివృద్ధికరమైన గ్రామీణ తెలంగాణను సాధించుకోగలం. మార్చి నుంచి మండలాల్లో రిజిస్ట్రేషన్లు మార్చి 12 నుంచి రెవెన్యూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పు రావాలి. ఇప్పుడున్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా 443 మండల కార్యాలయాలు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తాయి. మొత్తం 584 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్‌కు నెలల కొద్దీ సమయం పట్టదు. కోర్ బ్యాంకింగ్ నెట్వర్క్ తరహా విధానం అమలు చేస్తాం. పాస్‌బుక్కులను కొరియర్ ద్వారా ఇంటికే పంపుతాం. ‘ధరణి’వెబ్సైట్లో ఈ వివరాలు వెంటనే అప్డేట్ అవుతాయి. భూరికార్డుల ప్రక్షాళన నుంచి మార్చి 12 వరకు జరిగే క్రయ విక్రయాల వివరాలను కలెక్టర్లు ధరణి వెబ్సైట్లో అప్డేట్ చేయాలి. భూరికార్డుల ప్రక్షాళన విజయవంతమైంది. మనం ఎన్నో పనులు చేస్తుంటాం. కానీ ఇంత గొప్పగా చేయలేం. ఇది సాహసంతో చేశాం. దేశమంతా మనల్ని అభినందిస్తోంది. మనం కొత్త రాష్ట్రమైనా దేశానికి ఆదర్శమయ్యాం. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి. మున్ముందు పూర్తి అవినీతిరహితంగా జరగాలి. సాదాబైనామాలు ఇక బంద్ ఇప్పటివరకు అందిన సాదాబైనామా దరఖాస్తులను పూర్తి చేయాలి. మార్చి 12 తర్వాత సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించొద్దు భూ బదలాయింపులన్నీ రిజిస్ట్రేషన్ లేదా వారసత్వ హక్కుగా మ్యుటేషన్‌గా జరగాలి. సబ్రిజిస్ట్రార్లు, అధికారులకు కొత్త రిజిస్ట్రేషన్ విధానం, ఐటీ అప్లికేషన్లలో శిక్షణనివ్వాలి. బ్యాంకులు ఇకపై పంట రుణాల కోసం పట్టాదారు పాస్ పుస్తకాలు తాకట్టు పెట్టుకోకూడదు. ధరణి వెబ్సైట్లో వివరాలు చూసుకోవాలి. ఆర్వోఎఫ్ఆర్ ప్రతిపాదనలు, భూప్రక్షాళనకు సంబంధించి ఇంకేమైనా సమస్యలుంటే ప్రభుత్వానికి పంపించాలి. అసైన్డ్ భూములపై ఒక విధానం రూపొందించాలి. రెవెన్యూ శాఖ తగిన మార్గదర్శకాలు సిద్ధం చేయాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు తమ జిల్లాలలో వాటిని అన్వయించి తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలి. అసైన్డ్ భూముల విషయంలో మానవతా కోణంలో ఆలోచించాలి. మార్చి 11న కొత్త పాస్ పుస్తకాలు రైతులకు మార్చి 11 నాడు కచ్చితంగా కొత్త పాస్ పుస్తకాలు అందజేయాలి. దానికి ఒకరోజు ముందు, లేదా అదే రోజు ఉదయం ప్రతి గ్రామానికి పాస్ పుస్తకాలను చేరవేసేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రతి గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. కోటి ఎకరాలకు సాగునీరు 2020 సంవత్సరం నాటికి రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తాం. ఈ సంవత్సరం డిసెంబర్ చివరికే చాలా వరకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి. స్థానిక తక్షణావసరాల కోసం పెద్ద జిల్లాల కలెక్టర్లకు రూ.1.5 కోట్లు, చిన్న జిల్లాలకు రూ. కోటి కేటాయిస్తున్నాం. అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల స్థితిగతులు కంప్యూటరైజ్ చేయాలి. వీటి ఆధారంగా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక నిధిలో కేటాయించిన నిధులు వృథా కాకుండా ఉపయోగపడాలి. గొర్రెల పంపకం పథకం పకడ్బందీగా అమలవుతోంది. ఇప్పటికే 38,28,987 గొర్రెల పంపిణీ జరగ్గా.. వాటికి 14,56,376 పిల్లలు పుట్టాయి. ఇది పెద్ద కార్యక్రమం. రాబోయే రోజుల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మాంసం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుంది. గొర్రెల పెంపకంతో పాటు అవసరమైన గడ్డిని పెంచాలి. జిల్లాల్లో ఉన్న పండ్ల తోటల వివరాలు సేకరించి అక్కడ గడ్డి పెంచే అవకాశాలను పరిశీలించాలి..’’ -
దివాన్ చెరువులో వైఎస్ఆర్ సిపి విజయం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు విజయం సాధించారు. వైఎస్ఆర్ సిపి మద్దతుదారు చంద్రరావు 792 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామంలోని 16 వార్డులలో 12 వార్డులలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ మూడు వార్డులలో, టిడిపి ఒక వార్డులో విజయం సాధించాయి. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఈ పంచాయతీని దివాన్‌చెరువు, శ్రీరామపురంగా విభజించేందుకు 1996లో అప్పటి పాలకవర్గం తీర్మానించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు స్థానికులు హైకోర్టుకు వెళ్లారు. గత ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టు తీర్పు వారికి అనుకూలంగా ఇచ్చింది. విభజించకుండానే గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. గత మార్చిలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సమయానికి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు జరగలేదు. అందువల్ల అప్పట్లో దివాన్‌చెరువు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. తరువాత ప్రాదేశిక, పురపాలక, సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కూడా జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజు ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. దివాన్‌చెరువు పంచాయతీకి శ్రీరామపురం, రఘునాథపురం శివారు గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8,597. సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. మల్లారపు సత్యానందం, కొవ్వాడ చంద్రరావు, నిడమర్తి సత్తిరాజు, బుంగా భాస్కరరావు, విజయ ప్రియదర్శిని సర్పంచ్ స్థానానికి బరిలో నిలిచారు. మొత్తం 16 వార్డులలో 15 చోట్ల ద్విముఖ, ఒక చోట త్రిముఖ పోటీ జరిగింది. ** -
దివాన్‌చెరువు పంచాయతీ వైసీపీ వశం
-
ఎవరిదారి వారిది
పార్టీ ఫిరాయింపులే కాదు..వర్గ విభేదాలూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కుంగదీస్తున్నాయి. నమ్మకంగా ఉన్న క్యాడర్‌ను దూరం చేస్తున్నాయి. కోడుమూరు నియోజకవర్గంలోనూ ఇదే జరిగింది. ఇన్నాళ్లు తమకు అనుకూలంగా ఉన్నవర్గమంతా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరిపోవటంతో కాంగ్రెస్ నాయకులు డీలాపడ్డారు. ఏమీ చేయలేని స్థితిలో ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు బుధవారం అర్ధరాత్రి.. 12 గంటలకు ఎవరికీ తెలియకుండా గూడూరు పట్టణంలో తన అనుచరులతో రహస్యంగా అనుమతి సమావేశమయ్యారు. గూడూరు, సి.బెళగల్ మండలాల్లోని మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వ్యతిరేక వర్గీయులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘కేంద్ర రైల్యేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దగ్గర మనకు విలువ లేదు, మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నా.... ప్రత్యర్థులను ఎదుర్కోలేక నిశ్చేష్టుడనయ్యా... మీకు న్యాయం చేయలేను.. మీ దారి మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు అనుకూలించకపోతే నేను కూడా త్వరలో మీ వెంటే వస్తాను’ అని ఆ నాయకుడు తన అనుచరవర్గంతో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతటి స్థాయిలో ఉన్నా తనకు సరైన గౌరవం లభించడం లేదని ఆయన వాపోయారు. కనీసం గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తనకున్న హోదాను గౌరవించడం లేదని.. అధికారులను అభివృద్ధిపై ప్రశ్నించే స్వేచ్ఛను కూడా కోల్పోయానని అనుచరులవద్ద ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. కోట్ల వర్గీయులు తనను పేరు పెట్టి పిలిచి ప్రజల ముందే అవమానకరంగా మాట్లాడుతున్నారని, పదవి వాళ్ల నుంచి వచ్చిందనే చిన్నచూపు చూస్తున్నారని, ఎన్నాళ్లు అణిగిమణిగి బతకాలని కార్యకర్తల దగ్గర వాపోయినట్లు తెలిసింది. గూడూరులో రాత్రి 12 గంటల నుంచి గంటన్నరసేపు కార్యకర్తలతో ఆ నాయకుడు నిర్వహించిన రహస్య భేటి సంచలనమైంది . ప్రస్తుతం గూడూరులో జరుగుతున్న నగర పంచాయతీ ఎన్నికల్లో తన అనుచర వర్గీయులందరినీ ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేయాలని సూచించినట్లు సమాచారం. ఐదారుగురు కౌన్సిలర్లు గెలిస్తే మనమే కీలకమవుతామని, మన సత్తాచాటాలని తన అనుచరులకు సూచించినట్లు తెలిసింది.