ఇంతవరకు మనం చాలా ఎలక్షన్స్‌లో నిలబడ్డ నాయకులు వారికి వచ్చిన ఓట్లు గురించి విని ఉంటాం. అంతెందుకు చాలామంది కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన నాయకులను కూడా చూసి ఉంటాం. పోనీ ఎప్పుడూ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వచ్చే నాయకుడికి సైతం అత్యంత ధారుణంగా ఓట్లు వచ్చిన ఘటనలను చూసి ఉంటాం. కానీ గుజరాత్‌లోని ఒక వ్యక్తికి మాత్రం ఎంత ధారుణంగా ఓట్లు వచ్చాయంటే ఇప్పటి వరకు అన్ని ఓట్లు వచ్చి ఉండవు.
(చదవండి: విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు)
అసలు విషయంలోకెళ్లితే...గుజరాత్‌లోని వాపి జిల్లాలోని చర్వాలా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో సర్పంచి పదవికి సంతోష్ అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు ఎంతగానో మద్దతు ఇస్తారని సంతోష్ ఆశించారు. పైగా అతని కుటుంబంలోనే 12 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే తనకు ఒక్క ఓటు మాత్రమే వచ్చిందని తెలిసి సంతోష్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. పైగా సంతోష్ తన అభ్యర్థిత్వానికి కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వకపోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కోపంతో విరుచుకుపడ్డాడు. నిజానికి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఓటరు తన వార్డుకు సర్పంచ్‌ని ఎన్నుకోవడానికి ఒక ఓటు పంచాయతీ సభ్యులకు ఒక ఓటు అంటే మొత్తంగా ఎన్నుకునేందుకు రెండు ఓట్లు వేయాలి.
(చదవండి: నిబంధనలకు విరుద్ధం!..జుట్టు కత్తిరించిన ప్రిన్స్‌పాల్)
Comments
Please login to add a commentAdd a comment