రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను వచ్చే నెల (ఫిబ్రవరి)లోనే నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. సర్పంచ్‌లను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలా, పరోక్షంగానా అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతోందని, ఆ ఎన్నికల విధి విధానాలను కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరుస్తామని తెలిపారు. ఈ మేరకు వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు వేల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తామని, మున్సిపల్ చట్టానికి సవరణలు చేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు.
Published Fri, Jan 19 2018 9:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
Advertisement