గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల | | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 3 2013 1:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. జూలై 23, 27, 31 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదికన ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ఈ నెల 9న నోటీసు జారీ చేస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు జూలై 13. ఉపసంహరణకు చివరి తేదీ జూలై 17. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ ముగిసిన గంట తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 21వేల 491 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనం చేస్తారనే గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్‌ విడుదలవడంతో రాష్ట్రమంతటా ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement