మోగిన నగారా | | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 3 2013 3:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. జూలై 23, 27, 31 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదికన ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ఈ నెల 9న నోటీసు జారీ చేస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు జూలై 13. ఉపసంహరణకు చివరి తేదీ జూలై 17. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ ముగిసిన గంట తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 21వేల 491 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనం చేస్తారనే గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్‌ విడుదలవడంతో రాష్ట్రమంతటా ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. జులై 23న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జులై 23: ఆదిలాబాద్‌జిల్లా ఉట్నూరు డివిజన్‌ జులై 23: అనంతపురం : పెనుగొండ డివిజన్‌ జులై 23: చిత్తూరు జిల్లా తిరుపతి రెవిన్యూ డివిజన్‌ జులై 23: తూ.గో రాజమండ్రి రెవిన్యూ డివిజన్‌ జులై 23: గుంటూరు జిల్లా తెనాలి రెవిన్యూ డివిజన్‌ జులై 23: కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి, మంథని రెవిన్యూ డివిజన్‌ జులై 23: ఖమ్మం జిల్లా భద్రాచలం రెవిన్యూ డివిజన్‌ జులై 23: కృష్ణాజిల్లా నూజివీడు రెవిన్యూ డివిజన్‌ జులై 23 : కర్నూలు జిల్లా కర్నూలు డివిజన్‌ జులై 23 : మహబూబ్‌నగర్‌ గద్వాల్‌, నారాయణపేట్‌ డివిజన్లు జులై 23 : మెదక్‌ జిల్లా సిద్దిపేట డివిజన్‌ జులై 23 : నల్గొండ జిల్లా భువనగిరి డివిజన్‌ జులై 23 : నిజామాబాద్‌ జిల్లా నిజామాబాద్‌ డివిజన్ జులై 23 : ప్రకాశం జిల్లా ఒంగోలు రెవిన్యూ డివిజన్ జులై 23 : రంగారెడ్డిజిల్లా రంగారెడ్డి ఈస్ట్‌ డివిజన్ జులై 23 : నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూర్‌ డివిజన్లు జులై 23 : శ్రీకాకుళంజిల్లా శ్రీకాకుళం డివిజన్‌ జులై 23 : విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్‌ జులై 23 : విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌ జులై 23 : వరంగల్‌జిల్లా ములుగు డివిజన్‌ జులై 23 : ప.గో జిల్లా ఏలూరు డివిజన్‌ జులై 23 : వైఎస్సార్‌ జిల్లా కడప డివిజన్ రెండో దశ ఎన్నికలు: జులై 27న జులై 27:ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల డివిజన్‌ జులై 27:అనంతపురం జిల్లా ధర్మవరం రెవిన్యూ డివిజన్‌ జులై 27:: చిత్తూరు జిల్లా చిత్తూరు రెవిన్యూ డివిజన్‌ జులై 27: తూ.గో జిల్లా కాకినాడ రెవిన్యూ డివిజన్‌ జులై 27:గుంటూరు: గుంటూరు రెవిన్యూ డివిజన్‌ జులై 27: కరీంనగర్‌జిల్లా జగిత్యాల , సిరిసిల్ల డివిజన్లు జులై 27:ఖమ్మం జిల్లా ఖమ్మం రెవిన్యూ డివిజన్‌ జులై 27: మహబూబ్‌నగర్‌ జిల్లా డివిజన్‌ జులై 27: మెదక్‌ డివిజన్‌ జులై 27: నల్గొండ జిల్లాలోని సూర్యాపేట డివిజన్‌ జులై 27: నిజామాబాద్‌లోని బోధన్ డివిజన్ జులై 27: ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జులై 27: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల డివిజన్ జులై 27: నెల్లూరు డివిజన్ జులై 27: శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్‌ జులై 27: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం డివిజన్ జులై 27: విజయనగరం డివిజన్‌ జులై 27: వరంగల్‌జిల్లా మహబూబాబాద్‌, నర్సంపేట డివిజన్లు జులై 27: ప.గో.జిల్లా కొవ్వూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లు జులై 27: రాజంపేట డివిజన్‌ మూడోదశలో ఎన్నికలు : జులై 31న జులై 31: ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ డివిజన్‌ జులై 31: అనంతపురం జిల్లా అనంతపురం డివిజన్‌ జులై 31: చిత్తూరు జిల్లా మదనపల్లి డివిజన్‌ జులై 31: తూ.గో జిల్లా అమలాపురం డివిజన్ జులై 31: గుంటూరు జిల్లా నర్సారావుపేట డివిజన్‌ జులై 31: కరీంనగర్‌ జిల్లా కరీంనగర్‌ డివిజన్ జులై 31: ఖమ్మంజిల్లా కొత్తగూడెం, పాల్వంచ డివిజన్లు జులై 31: కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుడివాడ డివిజన్లు జులై 31: కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌ జులై 31: మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌ కర్నూలు, వనపర్తి డివిజన్లు జులై 31: మెదక్‌ జిల్లా సంగారెడ్డి డివిజన్లు జులై 31: నల్గొండ జిల్లా మిర్యాగూడ, దేవరకొండ డివిజన్లు జులై 31: నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి డివిజన్‌ జులై 31: ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్‌ జులై 31: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ డివిజన్ జులై 31: నెల్లూరు జిల్లా గూడూరు, నాయుడుపేట డివిజన్లు జులై 31: శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్‌ జులై 31: విశాఖజిల్లా అనకాపల్లి డివిజన్‌ జులై 31: వరంగల్‌ జిల్లా జనగాం డివిజన్‌ జులై 31: పగో జిల్లా నర్సాపురం డివిజన్‌ జులై 31: వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు డివిజన్

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement