పిట్టలవానిపాలెం మండలం అల్లూరు నామినేషన్ కేంద్రం వద్ద ఏకగ్రీవ ఎన్నిక పత్రాలతో సర్పించ్ మంతెన గంగరాజు, వార్డు సభ్యులు
సాక్షి, గుంటూరు : పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పలు పంచాయతీల్లో ఏకగ్రీవాలకే ఓటు వేశారు. రికార్డు స్థాయిలో 67 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి దశలో తెనాలి డివిజన్‌లో 337 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా 20 శాతం పంచాయతీలు పోటీ లేకుండా అభ్యర్థుల గెలుపొందారు. పల్లెల్లో అభివృద్ధి, ప్రశాంతతకు ప్రజలు ఓటు వేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా పెంచడం, పార్టీలకు అతీతంగా ఏకగ్రీవాలను వైఎస్సార్ సీపీ ప్రోత్సహించడంతో ఈ దఫా ఏకగ్రీవాలు భారీస్థాయిలో జరిగాయి. 2013లో జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 15 శాతమే ఏకగ్రీవాలు జరిగాయి. టీడీపీ పంతం కోసం బలవంతంగా అభ్యర్థులను బరిలోకి దించకపోతే మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యేవని రాజకీయ విశ్లేష కులు పేర్కొంటున్నారు. టీడీపీ ఉనికిని కాపాడుకోవడం కోసం పచ్చపల్లెల్లో చిచ్చురేపుతోందని ప్రజలు మండిపడుతున్నారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న తెనాలి డివిజన్‌లో నియోజకవర్గాల వారీగా రేపల్లెలో 17, ప్రత్తిపాడులో ఆరు, వేమూరులో 12, బాపట్లలో 15, పొన్నూరులో 10, తెనాలిలో ఏడు పంచాయతీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. 17 మేజర్ పంచాయతీలు ఏకగ్రీవం వైపు పయనించడం అభినందనీయం.
270 పంచాయతీలలో పోలింగ్...
తెనాలి డివిజన్ పరిధిలో 337 పంచాయతీలకు జనవరి 31న గడువు ముగిసే సమయానికి 1,757 మంది నాటికి నామినేషన్లు సమరి్పంచారు. పరిశీ లన తర్వాత 96 నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో 1,661 మిగిలాయి. 3,442 వార్డు స్థానాలకు 8,048 నామినేషన్లు దాఖలు చేయగా, 176 తిరస్కరణకు గురవ్వగా 7,872 నామినేషన్లు మిగిలాయి. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత 270 పంచాయతీల్లో ఈ నెల 9న పోలింగ్ జరగనుంది.
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను తెలుగు అక్షరమాల క్రమంలో రిటరి్నంగ్ అధికారులు ప్రకటించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తును వరుస క్రమంలో ప్రకటించారు. వాటిని అక్షర క్రమంలో మొదటి వ్యక్తికి మొదటి గుర్తు, రెండో వ్యక్తికి రెండో గుర్తు ... ఇలా ఎంతమంది పోటీలో ఉంటే అన్ని గుర్తులను
కేటాయించారు.
జోరందుకున్న ప్రచారం
పంచాయతీ పోరు తుది దశకు చేరడంతో ప్రచారం జోరందుకుంది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా, వారి గుర్తులను ఎన్నికల అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు తమ గుర్తులను ఓటర్లకు చేరేలా ప్రచురణ పత్రాలు, ఫ్లెక్సీలు సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలి్చతే ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను ప్రత్యక్షంగా కలసి అభ్యర్థించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో ప్రచారం కూడా బాగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment