
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దిరెడ్డికి గులాబీ కండువా వేసి పార్టీలోకి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో గతంలో తామిద్దరం కలిసి పని చేసినట్లు సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితులని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం కావడానికి నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment