గోవాలో రాజకీయం ఒక్కసారిగా ఊహించని ములుపు తిరిగింది. ప్రతిపక్షంలో ఉన్న 8 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. కాగా, బీజేపీలో చేరిన వారీలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కూడా ఉండటం విశేషం.
కాగా, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారి రాజీనామా లేఖలను స్పీకర్‌కు అందజేశారు. దీంతో, కాంగ్రెస్ శాసనసభాపక్షం బీజేపీలో విలీనమైంది. కాగా, ఇది కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్ చోడో యాత్ర కొనసాగుతోందంటూ ఎద్దేవా చేశారు.
Goa | 8 Congress MLAs including Digambar Kamat, Michael Lobo, Delilah Lobo, Rajesh Phaldesai, Kedar Naik, Sankalp Amonkar, Aleixo Sequeira & Rudolf Fernandes join BJP in presence of CM Pramod Sawant pic.twitter.com/uxp7YaZAUN
— ANI (@ANI) September 14, 2022
Comments
Please login to add a commentAdd a comment