గోవా సీఎం వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం! | After Manohar Parrikars Beer Comment, Twitter fire | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 11 2018 11:47 AM | Last Updated on Sun, Feb 11 2018 12:37 PM

After Manohar Parrikars Beer Comment, Twitter fire  - Sakshi

బీర్లు తాగుతున్న యువతుల ఫొటోలు

సాక్షి, హైదరాబాద్‌ : అమ్మాయిలు కూడా బీర్లు తాగడం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువురు 'గర్ల్స్ హూ డ్రింక్ బీర్'  హ్యాష్‌ ట్యాగ్ జోడిస్తూ, పారికర్ వ్యాఖ్యలకు నిరసనగా బీరు తాగే ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు.

అమ్మాయిలు బీరు తాగడాన్ని మాత్రమే చూశానని పారికర్‌ చెబుతున్నారని, మహిళలు పోర్న్ చూస్తారని, సిగరెట్లు తాగుతారని ఆయనకు తెలిస్తే నెలల తరబడి నిద్రపోరేమోనని ఒకరు, ప్రధాని మహిళను చూసి నవ్వుతారు, పారికర్ అమ్మాయిలను చూసి భయపడతారు, యోగి మహిళలను ఇంటికే పరిమితం చేయాలంటారు... వీరా మన పాలకులు అని ఇంకొకరు  ప్రశ్నిస్తున్నారు.

పారికర్ కు ఎనిమిది నెలల పాటు అత్యాచారనికి గురైన అమ్మాయి విషయం తెలియదా? పరువు హత్యలు కనిపించడం లేదా? పట్టపగలు బస్సుల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తెలియవా అని నిలిదీస్తున్నారు. ఇవన్నీ పారికర్ ను భయపెట్టలేదా అని ట్రోల్‌ చేస్తున్నారు. ఓ అమ్మాయిగా బీరు తాగడం నాకిష్టం అంటూ పలువురు అమ్మాయిలు బీరు తాగుతున్న ఫొటోలను పోస్టు చేస్తున్నారు. ఇంకొందరు యువతులైతే  తండ్రితో బీరు తాగిన ఫొటోలను పోస్ట్‌ చేయండని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement