గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీలోకి అడుగుపెట్టి తొలిసారి ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు.
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీలోకి అడుగుపెట్టి తొలిసారి ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు.
ముఖ్యమంత్రి బాధ్యతలతోపాటు ఆర్థికశాఖను కూడా తన వద్దే ఉంచుకున్న పారికర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరుకానున్నట్లు గోవా ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. ‘గోవా ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్రమోదీని ఈ రోజు కలిశారు’ అని వారు వెల్లడించారు. గోవా ఎన్నికల తర్వాత అంతకుముందు రక్షణశాఖ బాధ్యతలు నిర్వహించిన మనోహర్ పారికర్ ఆ బాధ్యతలు వదిలేసి గోవా పరిపాలన పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే.