ఢిల్లీకి వెళ్లడం ఇష్టం లేదు: పారికర్
ఢిల్లీకి వెళ్లడం ఇష్టం లేదు: పారికర్
Published Sun, Nov 9 2014 11:20 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
పానాజీ: కేంద్రమంత్రి పదవికంటే ముఖ్యమంత్రి పీఠమే చాలా కష్టమైందని గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాలని ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. కేంద్రమంత్రి కంటే ముఖ్యమంత్రి పదవే చాలా బాధ్యతాయుతమైంది. కేంద్రమంత్రికి తక్కువ తేలికైన బాధ్యతలుంటాయి అని పరిక్కర్ అన్నారు. గోవాను వదిలి ఢిల్లీకి వెళ్లడం ఇష్టం లేదు.
'గత మే మాసంలోనే తనకు కేంద్ర కేబినెట్ లో చేరాలనే అంశం చర్చకు వచ్చినట్టు రూమార్లు వచ్చాయి. ప్రస్తుతం కూడా కేంద్రమంత్రి పదవిని చేపట్టడం ఇష్టం లేదు.. కాని జాతి ప్రయోజనాలు ముఖ్యం. స్వయంగా ప్రధాని అడిగినపుడు కాదనలేము కదా' అని పారిక్కర్ అన్నారు. అవినీతిపై మోడీ, తనది ఒకటే బాట, తమ ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయి. పాజిటివ్ డైరెక్షన్ లో దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు మోడీతో కలిసి పనిచేస్తానని పారికర్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కోరిక మేరకు కేంద్ర రక్షణశాఖామంత్రి పదవిని చేపట్టేందుకు గోవా ముఖ్యమంత్రి పదవికి పారిక్కర్ రాజీనామా చేశారు.
Advertisement
Advertisement