ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించి న్యాయం చేస్తున్నామని పారికర్ తెలిపారు.
దేశ సరిహద్దుల్లో చొరబాట్లను విజయవంతంగా నిరోధిస్తున్నామని కూడా రక్షణ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి భారతదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు.
'ప్రత్యేక హోదాకు న్యాయపరమైన చిక్కులు'
Published Thu, Jun 16 2016 6:30 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement