‘త్వరలోనే తిరిగి వస్తా’ | Amit Shah Release Manohar Parrikar Video | Sakshi
Sakshi News home page

‘త్వరలోనే తిరిగి వస్తా’

Published Sun, May 13 2018 8:34 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Amit Shah Release Manohar Parrikar Video - Sakshi

మనోహర్‌ పారికర్‌ (ఫైల్‌ ఫొటో)

పనాజి: తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలంటూ గోవా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిర్వహించిన ధర్నాకు అధికార బీజేపీ స్పందించింది. ధర్నాకు వివరణగా అమెరికాలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ వీడియోను ఆదివారం విడుదల చేసింది. వీడియోలో పారికర్‌ మాట్లాడుతూ.. తాను పూర్తిగా కోలుకున్నానని, కొన్ని వారాల్లో రాష్ట్రానికి తిరిగి వస్తానని పారికర్‌ పేర్కొన్నారు. ఈ వీడియోను బీజేపీ కార్యకర్తల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రదర్శించారు.

రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్‌షాకు వ్యతిరేకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలని  శనివారం పనాజిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం పారికర్‌ అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement