కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి | @manoharparrikar and three Service Chiefs pay homage to Kargil martyrs at Amar Jawan Jyoti, India Gate | Sakshi
Sakshi News home page

కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి

Published Tue, Jul 26 2016 9:39 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

@manoharparrikar and three Service Chiefs pay homage to Kargil martyrs at Amar Jawan Jyoti, India Gate

న్యూఢిల్లీ : కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన అమర జవాన్లకు రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పమాల ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల అధిపతులు అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రక్షణమంత్రి పారికర్...అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా జరుపుకొనే 'విజయ దివస్' సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. 'మాతృభూమి కోసం పోరాడి, యుద్ధంలో మరణించిన సైనికులకు తలవంచి సెల్యూట్ చేస్తున్నా. త్రివిధ దళాల శౌర్యానికి, త్యాగానికి ప్రతీక విజయ్ దివస్' అని ఆయన ఈరోజు ఉదయం ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement