![ఆ నటుడికి బుద్ధి చెప్పారు](/styles/webp/s3/article_images/2017/09/4/81469954274_625x300.jpg.webp?itok=5mpF75yJ)
ఆ నటుడికి బుద్ధి చెప్పారు
ఆమిర్‌పై పరీకర్ పరోక్ష వ్యాఖ్య
న్యూఢిల్లీ: ‘దేశం విడిచి వెళ్లాలనుకున్నాం’ అన్న నటుడికి ప్రజలు బాగా బుద్ధి చెప్పారని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘దేశం గురించి చెడుగా చెప్పడానికి ఎవరైనా ఎలా సాహసిస్తారు? దేశం విడిచివెళ్లిపోవాలని భార్య కిరణ్‌రావు తనతో చర్చించినట్లు ఆమిర్ మీడియాతో చెప్పారు. ఆ తర్వాత ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ ఆన్‌లైన్ సంస్థకు ప్రజలు దూరంగా జరిగార’ని పరీకర్ వ్యాఖ్యానించారు. పరీకర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది.
దళితులు, మైనారిటీలు, రచయితలు, నటులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఆరెస్సెస్‌లు దాడులు చేస్తున్నాయంది. ‘విద్వేషమనేది పిరికివాడి పని అని. ఇది ఎన్నటికీ విజయం సాధించదు. ఇది మీకు గుణపాఠం అవుతుంది’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనిపై పరీకర్ వివరణ ఇస్తూ తాను ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడలేదన్నారు.