న్యూఢిల్లీ: రాబోయే రెండేళ్లలో ఆయుధాల ఎగుమతులను రూ. 13.40 లక్షల కోట్లకు పెంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. ఏరోస్పేస్ అండ్ ఏఎంపీ రక్షణ సదస్సులో మాట్లాడిన ఆయన ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టం కూడా కాదని అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఫైటర్ విమానాలు, హెలికాప్టర్లను తయారుచేయనున్నట్లు వివరించారు.
దేశీయంగా తయారుచేసే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల ఎగుమతి విషయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులతో పలుమార్లు సమావేశమైనట్లు తెలిపారు. దాదాపు 120 తేజస్ విమానాలను తయారుచేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అందించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తయారీ విషయంలో ఒకటి లేదా రెండు మార్పులు ఉండే అవకాశం ఉందని వివరించారు.
పరీకర్ పెట్టిన టార్గెట్.. 13 లక్షల కోట్లు!
Published Sat, May 14 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement