వాషింగ్టన్: హమాస్ చెరలోని బందీలకు త్వరలోనే స్వేచ్ఛ లభించనుందా? ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా?. ఈ రెండు ప్రశ్నలకూ సమాధానం అవును! ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, టెస్లా కార్ల కంపెనీ అధిపతి ఇలాన్ మస్క్ ఈ దిశగా చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవికి ఎన్నికైన తరువాత మస్క్‌ను పరిపాలన సమర్థతను పెంచే మంత్రిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ ప్రారంభంలో హెర్జోగ్ చర్చల కోసం మస్క్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. గాజాలోని హమాస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించేందుకు ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు.
బందీల విషయంలో డీల్ కుదిరేలా అన్ని పక్షాలపై ఒత్తిడి తీసుకురావాలని మస్క్‌కు హెర్జోగ్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. తాను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేలోపు బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తానని హమాస్‌కు ఇటీవల ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బందీల కుటుంబాల్లో తమవారి విడుదలపై ఆశలు చిగురించాయి.
బందీల కుటుంబ సభ్యులంతా కలిసి తమవారి విడుదల కోసం అధ్యక్షుడు హెర్జోగ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ట్రంప్‌కు సన్నిహితుడిగా ఉన్న మస్క్ ద్వారా ఈ విషయమై ప్రయత్నించాలని వారు కోరడంతో హెర్జోగ్ టెస్లా అధినేతతో చర్చలు జరిపారని సమాచారం.
ఇదీ చదవండి: నన్ను క్షమించండి: సౌత్‌కొరియా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment