ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల నాయకులు ఆదివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల నాయకులు ఆదివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రేపు ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె యథాతథంగా ఉంటుందని చెప్పారు.
ఉద్యోగులకు 22 శాతం ఐఆర్ ఇవ్వడానికి ఆర్టీసీ యాజమాన్యం ముందుకొచ్చింది. అయితే కార్మిక సంఘాలు 32 శాతం ఇవ్వాలని పట్టుబట్టాయి. ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య ఓ అవగాహన కుదరకపోవడంతో సమావేశం మధ్యలోనే ఈయూ, టీఎమ్యూ నేతలు బయటకు వచ్చారు. కాగా రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కార్మిక సంఘం నేతల్ని చర్చలకు ఆహ్వానించారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు చర్చలు జరగనున్నాయి.