No solution
-
మాటల్లోనే పరిష్కారం..!
‘గంట్యాడ మండలం పెదమజ్జి పాలెం గ్రామానికి చెందిన పాతిన రాణి పింఛన్ కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకుంది. పింఛన్ మంజూరు కాలేదు. కనీసం ఎందుకు రావడం లేదో తెలియజేయలేదు. నవంబర్ 19న మరోసారి గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పక్షవాతంతో బాధపడుతున్న ఆమె గ్రీవెన్స్‌కు వచ్చేందుకు అవస్థలు పడుతోంది. అధికారులు మాత్రం పింఛన్ ఆదరువు కల్పించలేకపోతున్నారు.’ ‘విజయనగరం పట్టణంలో కె.ఎల్.పురం వజ్రపుబంద ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు నెలలు తరబడి చర్యలు తీసుకోలేదు. ఆక్రమణలు విషయం నీటిపారుదలశాఖ అధికారులే అంగీకరిస్తున్నా తొలిగించేందుకు చొరవ తీసుకోపోవడం శోచనీయం’. విజయనగరం గంటస్తంభం: గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి మీరెప్పుడైనా చూశారా? అక్కడ అర్జీ ఇచ్చేందుకు జనం పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. నడవడానికి శరీరం సహకరించని వృద్ధులు... పుట్టుకతోనే వైకల్యంతో బాధపడే విభిన్న ప్రతిభావంతులు... ఎన్నో ఏళ్లుగా సమస్యతో పోరాడుతున్న బాధితులు... అన్నీ పత్రాలు ఉన్నా రికార్డుల్లో భూమి హక్కులు లేని రైతులు.. ఇలా ఎంతోమంది కనపడతారు. రెక్కాడితేగాని డొక్కాడని కూలీలు...చేతిలో చిల్లుగవ్వ లేని పేదలు అప్పులు చేసి మరీ గ్రీవెన్స్‌సెల్‌కు వస్తారు. వారిని చూసినా... వారిని కదిపినా కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి దరఖాస్తు ఇస్తే పరిష్కారమైనట్లేనన్న ఆశ వారిలో కనిపిస్తుంది. ఒకసారి వస్తేగానీ ఇక్కడ పరిస్థితి అర్థం కాదు.. ఇదంతా ఎండమావులే అని. చేతల్లో కా కుండా మాటలతోనే ఫిర్యాదులు పరిష్కరించేస్తున్నారని.. జిల్లాలో గ్రీవెన్స్‌సెల్ అర్జీల పరిష్కా రం తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నామమాత్రపు పరిష్కారం మీకోసం కార్యక్రమంలో వచ్చిన వినతుల్లో దాదా పు అన్నీ పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతుంది. ఆన్లైన్లో అలాగే చూపిస్తున్నారు. వాస్తవానికి ఎం తమంది ఇచ్చిన అర్జీదారులకు సరైన పరిష్కా రం లభించందంటే నామమాత్రమే అని చెప్పాలి. పరిష్కారం అంటే ప్రభుత్వం, అధికారుల దృష్టిలో అర్జీకి ఏదో ఒక సమాధానం చెప్పడం. కానీ అర్జీ దారుడు దృష్టిలో తాను అధికారుల దృష్టిలో పెట్టిన సమస్య పరిష్కారమైతేనే న్యాయం జరిగినట్లు. ఈవిషయం అధికారులకు తెలిసినా తమ వద్ద అర్జీ పెండింగ్ లేకుండా ఏదో ఒక సమాధానం చెప్పేస్తున్నారు. ఒక్కోసారి తమ పరిధిలోనిది కాదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాధానం ఇచ్చి సరిపెడుతున్నారు. ఇవన్నీ పరిష్కారమైనట్లేనని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో లెక్కకు వినతులు పరిష్కారం జరిగినా వాస్తవంలో ప్రజలు ఇబ్బందులు తీరడం లేదు. గత నాలుగేళ్లలో వచ్చిన వినతుల్లో అధికారులు పరిష్కారమైనట్లు చెబు తున్న వినతుల్లో 70శాతం పరిస్థితి ఇదే. దీంతో గ్రీవెన్స్‌సెల్‌లో వినతులు ఇవ్వడమే మినహా తమకు ఎటువంటి న్యాయం జరగడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపం ఎవరిది? గ్రీవెన్స్‌సెల్‌లో వినతులకు సరైన పరిష్కారం ల భించలేదన్నది జిల్లా వాసులందరికీ తెలుసు. ప్రతీ మండలం, ప్రతీగ్రామం నుంచి ఏదో సందర్భంలో ఎవరో ఒకరు గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి ఉంటా రు. వారి సమస్యకు ఎంతవరకు పరిష్కారం లభించిందో ఒకసారి తెలుసుకుంటే ఈ విషయం ఇట్టే బోధపడుతుంది. ఇందుకు లోపం ఎవరిదం టే ప్రభుత్వానిదేనని చెప్పక తప్పదు. అధికారులు పొరపాట్లు కూడా చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వంతో సంబంధం లేని వినతులు పరిష్కరించే అవకాశం ఉన్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. అర్జీదారుడు ఇచ్చిన గ్రీవెన్స్‌ను మళ్లీ మండలాలకు పంపిస్తున్నారు. వాస్తవానికి అక్కడకు వెళ్లి న్యాయం జరగలేదని భావించిన తర్వాత కలెక్టర్ వద్దకు వస్తున్నారు. ఆ విషయం మరిచి వారికే పంపడమే కాకుండా కనీసం వాస్తవమెంతో తెలుసుకోవడం లేదు. గ్రీవెన్స్ పిటీన్‌పై గ్రామాలకు వెళ్లి విచారణ చేసిన జిల్లా అధికారులను వేళ్లమీద లెక్క పెట్టవచ్చు. ఇకపోతే ప్రభుత్వం కూడా గ్రీవెన్స్ పరిష్కారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. నాలుగేళ్లలో వచ్చినవాటిలో 5.10 లక్షల వినతులు ఫైనాన్స్ సంబంధిత అం శాలే అయినా వాటి పరిష్కారానికి చొరవ లేదు. పింఛన్లు, ఇళ్లు, ఇళ్ల బిల్లులు, రుణాలు అధిక అర్జీ లు వస్తున్నా వారికి సమస్యకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇదిలాఉంటే 1100కు ఫోన్ చేసిన వారికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరు కావడం చూస్తే గ్రీవెన్స్‌సెల్‌కు విలువ లేదన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రీవెన్స్‌సెల్‌కు భవిష్యత్తులో ఎటువంటి ప్రాధాన్యముంటుందో చూడాలి. పట్టించుకోవడం లేదు.. పట్టణంలో ఉన్నా తమ గు రించి పాలకులు పట్టించుకోవడం లేదు. తమకు తాగునీరు, విద్యుత్ సరఫరా లేదని, ఇతర సౌకర్యాలు అందడం లేదు. గ్రీవెన్స్‌సెల్‌లో ఎన్నోసార్లు అధికారులకు సమస్య తెలియజేసినా పరిష్కా రం కాలేదు. అటు ప్రభుత్వం గానీ, అధికారులుగానీ తమను పట్టించుకోవడం లేదు. – మజ్జి సత్యవతి, కామాక్షినగర్ నగర్ మాంతిచెరువు నివేదిస్తే పరిష్కరించినట్టే.. అర్జీదారుడు సమస్యపై ఇచ్చే దరఖాస్తు విచారించి పరిష్కరిస్తున్నాం. ఆర్థికపరమైన విషయాలు ప్రభుత్వానికి నివేదించి ఆ విషయం అర్జీ దారుడుకు తెలియజేస్తున్నాం. పింఛన్లు, ఇళ్ల కోసం ఎక్కువగా అర్జీలు వ స్తున్నాయి. ఆ విషయం ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. ఆ విధంగా చేస్తే పరిష్కారమైనట్లే. చేయలేని వాటి విషయంలో అర్జీదారుడికి తెలియజేసి క్లోజ్ చేస్తున్నాం. అంటే ఆ దరఖాస్తుకు పరిష్కారం అయినట్టే. – జె.వెంకటరావు, డీఆర్వో, విజయనగరం -
ఆ మోసాలను ఆధార్‌తో అడ్డుకోలేం!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఆర్థిక నేరాలు, ఉగ్ర కార్యకలాపాల కట్టడికి ఆధార్ దోహదపడుతుందన్న కేంద్రం వాదనలతో సుప్రీంకోర్టు విభేదించింది. బ్యాంకింగ్ మోసాలకు ఆధార్‌తో పరిష్కారం లభించదంది. ఆధార్ చట్టబద్ధత, చెల్లుబాటుపై గురువారం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం, ప్రభుత్వ తరఫు లాయర్ల మధ్య ఆసక్తికర వాదనలు జరిగాయి. ‘బ్యాంకులను మోసగిస్తున్న వారెవరో అంతా బహిరంగంగానే తెలిసిపోతోంది. ఎవరెవరికి రుణాలు మంజూరు అవుతున్నాయో బ్యాంకులకు తెలియదా? అధికారులే మోసగాళ్లతో చేతులు కలిపి కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు ఆధార్ పరిష్కారం చూపదు’ అని బెంచ్ పేర్కొంది. లబ్ధిదారుల గుర్తింపునకే ప్రయోజనకరం సంక్షేమ పథకాల అసలు లబ్ధిదారులను గుర్తించడంలో మాత్రమే ఆధార్ ప్రభుత్వానికి సహాయపడుతుందని బెంచ్ పేర్కొంది. మొబైల్ ఫోన్లను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం వల్ల ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు, బాంబు దాడులను నివారించొచ్చని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. దీనికి ప్రతిగా బెంచ్ స్పందిస్తూ.. ‘ఉగ్రవాదులు సిమ్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటారా? కొంత మంది ఉగ్రవాదులను పట్టుకోవడానికి 120 కోట్ల మంది భారతీయులు మొబైల్ నంబర్లను ఆధార్‌తో అనుసందానం చేసుకోవాలని అడుగుతున్నారు. కేవలం చట్టబద్ధ జాతీయ ప్రయోజనాల రీత్యా అలా కోరడం సబబేనా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదల బతుకులు బాగుచేయడంలో ఆధార్ దోహద పడుతుందని వేణుగోపాల్ పేర్కొనగా.. ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతోందని, 67% సంపద ఒక శాతం ధనికుల వద్దే పోగైందని బెంచ్ పేర్కొంది. ప్రతిదానికీ ఆధార్‌ను తప్పనిసరి చేయడం వల్లే అనవసర సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. -
కశ్మీర్ సమస్యకు పరిష్కారమే లేదా!?
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాల బుల్లెట్లకు యువకులు నేలకొర గడం చూస్తుంటే ఎవరికైనా బాధాకరమే. కానీ కశ్మీరీలు మినహా యావత్ భారత దేశంలో పెద్దగా ఎవరూ బాధ పడరు. వారిని అమర వీరులుగా కశ్మీరీలు గుర్తిస్తారు. మిగతా దేశస్థులు వారిని టైస్టులుగా భావిస్తారు. ఎదురు కాల్పుల్లో సైనికులు మరణిస్తే కశ్మీరీలు బాధ పడరు. మిగతా దేశస్థులమైన మనం బాధ పడి నివాళులర్పిస్తాం. ‘ఆజాదీ’ కోసం ప్రాణాలర్పించే యువకులు వారికి ఎప్పటికీ స్వాతంత్య్ర యోధులే. మిగతా భారతావనికి వారెప్పుడూ టైస్టులే. దీనికి కారణం ఓ దేశమంటే కొన్ని రాష్ట్రాలతో కూడిన నైసర్గిక స్వరూపమనే భావన దక్షిణాసియులైన మనలోను నరనరాన జీర్ణించుకుపోయి ఉండడమే. దేశ నైసర్గిక సరిహద్దుల్లోని ఒక్క అంగుళం భూభాగాన్ని కోల్పోవడానికి కూడా మన మనస్తత్వం అంగీకరించదు, ఒక్క యుద్ధంలో తప్ప. దురాక్రమించుకోవడానికి మాత్రం వెనకాడం. సిక్కిం అలా సిద్ధించిందేనంటే కొందరికి కోపం రావచ్చు. కశ్మీరీలకు ఆజాది కావాలి. మనకు మన దేశంతో కశ్మీరు కలసి ఉండాలి. ఈ మనస్తత్వం మారనంతకాలం కశ్మీరు సమస్యకు పరిష్కారం లేదు. కశ్మీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కెనడా, బ్రిటన్ తరహా రెఫరెండమ్‌లు మనకు లేవు. కశ్మీరీ అనేది కశ్మీరుల సమస్య వారి నిర్ణయానికే వదిలేయాలన్న ఉదార స్వభావం మనకు ఎలాగు లేదు. కశ్మీర్‌ను వదిలేస్తే వారు పాకిస్తాన్‌తో కలసిపోతారని మన రాజకీయ నాయకులు హెచ్చరికలు చేస్తుంటారు. అక్కడి మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం వారు కోరుకుంటున్నది ‘ఆజాది’ తప్ప పాకిస్తాన్‌తో అంతర్భాగం కావాలన్నది కాదు. మన దేశంకన్నా ఎంతో వెనకబడిన పాకిస్తాన్లో అంతర్భాగం కావాలని వారు కోరుకుంటే అది వారి కర్మ అని వదిలేస్తే పోలా. మనం ప్రత్యేక బడ్జెట్ కింద ఏటా కేటాయిస్తున్న వందలాది కోట్ల రూపాయలు మనకు మిగులుతాయికదా! అందుకు ఒప్పుకోం. మన మ్యాప్‌లో మార్పు రాకూడదు. కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గతంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఫలితం లభించలేదు. ఇటీవలి కాలంలో అటల్ బిహారి వాజపేయి, మన్మోహన్ సింగ్‌లు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కాస్త చిత్తశుద్ధితోనే ప్రయత్నాలు కొనసాగాయి. శాంతి సరిహద్దుల పేరిట కశ్మీరులోకి ఇరు దేశాలకు సమాస యాక్సెస్ ఉండేలా పాకిస్తాన్‌తో మన్మోహన్ సింగ్ ఓ ప్రతిపాదన చేశారు. ఇసుంట రమ్మంటే ఇల్లంతా తనదంటుందేమో అన్న భయంతో మన్మోహన్ ముందుగా వెనకడుగు వేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా వెకన్కి తగ్గింది. కశ్మీర్‌కు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వకపోయిన పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే కశ్మీరులో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని మేథావులు, చరిత్రకారులు ఎప్పటి నుంచే చెబుతున్న అంశం. ఢిల్లీకే పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కల్పించడం ఇష్టంలేని నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీరుకు స్వయం ప్రతిపత్తి కల్పించడం కలే అవుతుంది. కశ్మీర్లో 370వ అధికరణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ అందుకు మొగ్గుచూపుతుందనుకోవడం అత్యాశే అవుతోంది. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఇంతవరకు ఎత్తివేయలేని ప్రభుత్వాలు ఆటానమస్ దిశగా ఆలోచిస్తాయని సమీప భవిష్యత్తులో ఊహించలేం. కశ్మీర్ సెగ మనకు ప్రత్యక్షంగా తగలదుకనుక మన మనస్తత్వంలో మార్పు వచ్చే అవకాశం లేదు. కశ్మీరులో బంద్‌లు పాటించిన, సమ్మెలు చేసినా మన మీద ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే కశ్మీర్ గుండా మనం వెళ్లే జాతీయ రహదారిగానీ, ఓ జాతీయ రైలు మార్గంగానీ లేదు. కశ్మీర్ మొత్తాన్ని మూసేసుకుంటే అది వారికి ఇబ్బందిగానీ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజస్థాన్‌లో గుజ్జార్లు చేసే సమ్మె సెగ మనకు తగులుతుందిగానీ కశ్మీర్ సెగ తగలదు. అంతవరకు కశ్మీరు రగులుతూనే ఉంటుంది. కశ్మీర్ యువకులు రాళ్లు రువ్వుతూనే ఉంటారు. విధ్వంసం సృష్టిస్తూనే ఉంటారు. భద్రతా బలగాలు లాఠీచార్జీలు చేస్తూనే ఉంటాయి. తూటాలు పేలుస్తూనే ఉంటాయి. ఇరువైపులా ప్రాణాలు పోతూనే ఉంటాయి. ‘ఆజాదీ’ అనే నినాదానికి అక్కడ చావు రాదు. -- ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
ఆగని అన్నదాతల ఆత్మహత్యలు
-
కేంద్ర పన్నుపై కానరాని పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆదాయ వనరుల పంపిణీపై ఏర్పాటైన అధికారుల కమిటీ చర్చల్లో కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్టీ) ప్రధాన అంశంగా మారింది. తెలంగాణ ప్రాంతంలో మద్యం ఉత్పత్తిచేసే కంపెనీలు ఎక్కువగా ఉండటంతో అక్కడే ఎక్కువగా మద్యం ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి నుంచే సీమాంధ్రకు రవాణా అవుతుంది. అయితే ఉత్పత్తి కంపెనీలు ఎక్కడ ఉన్నాయో అక్కడేప్రభుత్వం వాటి నుంచి రెండు శాతం సీఎస్టీ వసూలు చేస్తుంది. ఆ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వానికి సీఎస్టీ జమ చేసి, సీమాంధ్రలో (వినియోగం) వ్యాట్ చెల్లిస్తాయి. దీని వల్ల తెలంగాణకు రెండు శాతం సీఎస్టి రూపంలో ఆదాయం రానుండగా.. మద్యం ఎక్కువగా వినియోగించే సీమాంధ్ర వినియోగదారులపై వ్యాట్‌తో పాటు తెలంగాణలో కట్టిన సీఎస్టి భారం కూడా పడనుంది. విభజన బిల్లులో సీఎస్టి చెల్లింపు, చెక్‌పోస్టుల అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో సీఎస్టీ ఉండాలా వద్దా అనే దానిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులే అంతిమ నిర్ణయం తీసుకోవాలని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు. సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలా వద్దా అనేది కూడా వారే నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా తొలి రెండు అంకెలతో టిన్ నెంబర్‌ను రూపొందించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పన్ను బకాయిలు కేసులు వాదించడానికి ఏ ప్రభుత్వం ఖర్చుచేయాలి, కేసుల పరిష్కారమయ్యాక ఆ మొత్తాన్ని ఏ రాష్ట్రానికి దఖలు పరచాలి అనే విషయంపై కూడా స్పష్టత లేదని అధికార వర్గాలు తెలిపాయి. వీటన్నిటిపై మంగళవారం నాటికి తుది రూపం వచ్చే అవకాశం ఉందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు విఫలం
-
ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల చర్చలు విఫలం
హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల నాయకులు ఆదివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రేపు ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె యథాతథంగా ఉంటుందని చెప్పారు. ఉద్యోగులకు 22 శాతం ఐఆర్ ఇవ్వడానికి ఆర్టీసీ యాజమాన్యం ముందుకొచ్చింది. అయితే కార్మిక సంఘాలు 32 శాతం ఇవ్వాలని పట్టుబట్టాయి. ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య ఓ అవగాహన కుదరకపోవడంతో సమావేశం మధ్యలోనే ఈయూ, టీఎమ్‌యూ నేతలు బయటకు వచ్చారు. కాగా రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కార్మిక సంఘం నేతల్ని చర్చలకు ఆహ్వానించారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు చర్చలు జరగనున్నాయి.